పదేళ్ళపాటు ప్రేమించుకొని కుటుంబసభ్యుల సమక్షంలో ఒక్కటైన ఆదిత్య నారాయణ్, శ్వేతా అగర్వాల్

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ తాజాగా పెళ్లిపీటలు ఎక్కారు.  న‌టి శ్వేత అగ‌ర్వాల్‌ను వివాహ‌మాడాడు ఆదిత్య నారాయణ్.

పదేళ్ళపాటు ప్రేమించుకొని కుటుంబసభ్యుల సమక్షంలో ఒక్కటైన ఆదిత్య నారాయణ్, శ్వేతా అగర్వాల్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 12:48 PM

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్‌ తాజాగా పెళ్లిపీటలు ఎక్కారు.  న‌టి శ్వేత అగ‌ర్వాల్‌ను వివాహ‌మాడాడు ఆదిత్య నారాయణ్. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో మంగ‌ళ‌వారం రాత్రి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆదిత్య పెళ్లి వేడుక జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

షాపిత్ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో ఆదిత్య‌, శ్వేత అగ‌ర్వాల్ మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది. పదేళ్ళపాటు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ నూతన వధువరులకు పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదిత్య, శ్వేత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.