Actress Poojahegde: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న పూజాహెగ్డే ?

|

Jan 19, 2021 | 6:52 PM

గతేడాది విడుదలైన ఆల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో ఫుల్ ఫాంలో ఉంది పూజాహెగ్డే. ఇటీవలే ప్రభాస్ 'రాధేశ్యామ్'

Actress Poojahegde: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ.. ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న పూజాహెగ్డే ?
Follow us on

గతేడాది విడుదలైన ఆల వైకుంఠపురం సినిమా బ్లాక్‏బస్టర్ హిట్ కొట్టడంతో ఫుల్ ఫాంలో ఉంది పూజాహెగ్డే. ఇటీవలే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇక టాలీవుడ్‏లోనే కాకుండా అటు బాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా మారిపోయింది. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‏కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ.

సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా ‘మాస్టర్’. ఈ మూవీతో తమిళ స్టార్ హీరో విజయ్ మరో హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక విజయ్‏తో నెల్సన్ దీలిప్ కుమార్ ఓ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కాబోతుంది. దీని తర్వాత విజయ్ డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇక విజయ్, దిలీప్ కుమార్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే చిత్రబృందం పూజా హెగ్డెను ఎంపిక చేసినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇక పూజా హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దివాలి’, రణ్ వీర్ సింగ్ ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తుంది.

Also Read:

F3 Movie Update: ‘ఎఫ్‌-3’లో మరో హీరో..? గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్న మెగా హీరో..

RRR Climax : ఆర్ఆర్ఆర్ లో వారిద్దరూ దేనికోసం పోరాటం చేస్తున్నారో ఆ రోజు వచ్చిందంటున్న జక్కన్న