విశాల్ న‌న్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు!

| Edited By:

Aug 20, 2020 | 9:01 PM

ఇటీవ‌ల మీరా మిథున్ పేరు త‌రుచూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తుంది. సూర్య ఉంచి విజ‌య్ వ‌ర‌కు స్టార్ హీరోల‌ను కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. దీంతో మీరాపై త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ..

విశాల్ న‌న్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు!
Follow us on

ఇటీవ‌ల మీరా మిథున్ పేరు త‌రుచూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తుంది. సూర్య ఉంచి విజ‌య్ వ‌ర‌కు స్టార్ హీరోల‌ను కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. దీంతో మీరాపై త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు గుర్రుగా ఉన్నారు. ఇటీవల డైరెక్ట‌ర్ భార‌తీయ కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఇంత జ‌రిగినా ఆమె తీరులో ఎలాంటి మార్పులు రావ‌డం లేదు.

తాజాగా మీరా మిథున్‌కు సంబంధించిన మ‌రో వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. విశాల్ న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని రెండు, మూడేళ్లుగా వెంట‌ప‌డుతున్నాడ‌ని, కానీ డ‌బ్బు, పేరున్న వారిని పెళ్లి చేసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాక‌రించిన‌ట్టుగా ఆమె పేర్కొంది. అంతే కాకుండా త‌న త‌ల్లికి విశాల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, కానీ అత‌న్ని వివాహం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌పై విశాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మ‌రి.

Read More:

తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వ‌ర్షాలు!

సెప్టెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న ”వి” సినిమా

నాతో పాటు నా కూతురికి కూడా క‌రోనా సోకిందిః మాళ‌విక‌