Telangana junior colleges: ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు.. యాజమాన్యాలకు హెచ్చరికలు

|

Mar 24, 2021 | 6:52 PM

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ కాలేజీలు తెరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని.. కఠిన చర్యలకు వెనకాడమని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు.

Telangana junior colleges: ఇంటర్ కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు.. యాజమాన్యాలకు హెచ్చరికలు
Telangana Inter Colleges
Follow us on

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ కాలేజీలు తెరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని.. కఠిన చర్యలకు వెనకాడమని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కాలేజీలు మూసేయాలని మేనేజ్‌మెంట్స్‌కు ఆదేశించారు. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో  విద్యాసంస్థలన్నింటనీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్, I.A.S. ప్రకటన

  1. అకడమిక్ – జూనియర్ కాలేజీలను మూసివేయాలి
  2. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కళాశాలలు మూసివేసే ఉంచాలి
  3. ఆన్‌లైన్ / దూరవిద్య మునుపటిలాగే కొనసాగించవచ్చు
  4. ఇంటర్మీడియట్ కోర్సును అందించే అన్ని కళాశాలలు ఈ సూచనలను పాటించాలి.
  5. సూచనలు ఉల్లంఘిస్తే మేనేజ్‌మెంట్‌లు / ప్రిన్సిపాల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం

మరోవైపు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. త్వరలో రీ షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యాసంస్థలు కరోనా విస్పోటక కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో అలర్టైన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

మరోవైపు టెన్త్ క్లాస్, ఇంటర్‌ ఎగ్జామ్స్ విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. పరీక్షలు జరుగుతాయా?లేదా అనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు స్పష్టమవుతుంది.

Also Read:  తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి

ఆంధ్రప్రదేశ్‌లో‌ ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…