Health Tips: కొత్త సంవత్సరంలో ఆరోగ్యంపై దృష్టి సారించండి.. ఇలా ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌..!

|

Dec 31, 2021 | 12:50 PM

Health Tips: కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి. పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు..

Health Tips: కొత్త సంవత్సరంలో ఆరోగ్యంపై దృష్టి సారించండి.. ఇలా ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌..!
Follow us on

Health Tips: కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోండి. పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు, స్వేచ్చమైన ప్రోటీన్స్‌, రొట్టెలు, జున్ను లాంటి పదార్థాలను తీసుకోవడం మంచిది. ముందు కరోనా మహమ్మారి, ఒమిక్రాన్‌ వేరియంట్ల కారణంగా అజాగ్రత్తగా ఉండే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త సంవత్సరంలో మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను రూపొందించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

సరైన ఆహారాన్ని ఎంచుకోండి:
ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోండి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. విటమిన్స్‌ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఎక్కువ మొత్తం ఆకు కూరలు, బఠానీలు, పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

విటమిన్‌-డి:
శరీరానికి విటమిన్‌ డి ఎంతో అవసరం. ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి నివారించడంలో ఉపయోగపడతాయి. ప్రతి రోజు కనీసం 15-20 నిమిషాల పాటు సూర్యరశ్మీ ఉండేలా చూసుకోండి. దీని వల్ల డి విటమిన్‌ అధిక మోతాదులో శరీరానికి అందుతుంది.

ప్రతి రోజు వ్యాయమం:
కొత్త సంవత్సరంలో వ్యాయమాలు అలవాటు లేనివారు తగిన వ్యాయమాలు చేసేందుకు ప్లాన్‌ వేసుకోవడం మంచిది. ప్రతి రోజు క్రీడలు ఆడటం, లేదా బయటకు వెళ్లడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజు నడకను కొనసాగించాలి. శరీరానికి కొంత వ్యాయం ఉండేలా చూసుకోవాలి. మీ శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చూసుకోండి. కొన్ని రకాల శారీరక శ్రమలను అలవర్చుకోండి. దీని వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు.

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:
సహజం చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అర్ధరాత్రి వరకు సరైన నిద్రపోకుండా ఫోన్‌లలో, టీవీలు, కంప్యూటర్ల ముందు ఉండిపోతుంటారు. మనిషికి సరైన నిద్రలేకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. సరైన నిద్ర లేకపోతో ప్రమాదంలో పొంచివున్నట్లు అర్థం. ప్రతి రోజు కనీసం 7-8 గంటల సరైన నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే ఎన్నో వ్యాధులు దరి చేరుతాయి.

ఒత్తిడిని తగ్గించుకోండి:
ప్రతి ఒక్కరు ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఒత్తిడి పెరిగితే గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒత్తిడి అనేది శరీరంలోని అన్ని అవయవాలపై ఎఫెక్ట్‌ పడుతుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే ఎలాంటి వ్యాధులు దరి చేరవు.

ఉదయం దిన చర్య:
ప్రతి రోజు ఒక దినచర్య అనేది రూపొందించుకోవాలి. మీ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రోజువారీగా ప్రారంభించే పనులను సెట్‌ చేసుకోవాలి. చేసే పనులను బట్టి ప్రాధాన్యతగా సెట్‌ చేసుకోవాలి. వ్యాయమం, తీసుకునే ఆహారం ఇలా ఆరోగ్యానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Diabetes: డయాబెటిస్‌ బారిన పడేవారు అధికంగా పురుషులే.. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో కీలక విషయాలు

Papaya Benefits: బొప్పాయితో అదిరిపోయే ప్రయోజనాలు.. బెనిఫిట్స్‌ ఎంటో తెలిస్తే షాకవుతారు..!