COVID-19 and Black Fungus: నిజామాబాద్ జిల్లాను వ‌ణికిస్తున్న‌ బ్లాక్‌ఫంగస్‌..! ఒక్క రోజే 3 మ‌ర‌ణాలు..

|

May 18, 2021 | 3:59 PM

నిజామాబాద్ జిల్లాను బ్లాక్‌ఫంగస్‌ వణికిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. ఫంగస్‌ లక్షణాలతో మే 17న ఒక్కరోజే ముగ్గురు....

COVID-19 and Black Fungus: నిజామాబాద్ జిల్లాను వ‌ణికిస్తున్న‌ బ్లాక్‌ఫంగస్‌..! ఒక్క రోజే 3 మ‌ర‌ణాలు..
Black Fungus Case
Follow us on

నిజామాబాద్ జిల్లాను బ్లాక్‌ఫంగస్‌ వణికిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపింది. ఫంగస్‌ లక్షణాలతో మే 17న ఒక్కరోజే ముగ్గురు మృతిచెందటం కలవరపరుస్తోంది. మరికొంత మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. అసలే కరోనా మహమ్మారి తో తంటాలు పడుతున్న ప్రజలకి బ్లాక్ ఫంగస్ శాపంలా మారింది.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ కు చెందిన రాజేశ్వర్ కు కరోనా సోకి బ్లాక్ ఫంగస్ లక్షణాలు నిర్దారణ కావడం తో చికిత్స నిమిత్తం హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా బ్లాక్ ఫంగస్ తో పోరాడి చివరకు మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వర్‌ మరణవార్త విన్న ఆ కుటుంబ సభ్యుల రోదన అంతులేకుండా పోయింది. వారి రోదనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నవీపేట మండలం రాంపూర్‌ పంచాయతీ ఎల్‌కే ఫారానికి చెందిన బెజవాడ హరిబాబు (38)కు కోవిడ్ సోక‌డంతో శుక్రవారం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. కళ్లు వాపుగా ఉండటం గమనించిన డాక్ట‌ర్లు హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వేల్పూర్‌ మండలం సాయబ్‌పేటకు చెందిన చిన్నగంగారాం(63) కోవిడ్ వచ్చి తగ్గినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ రావడంతో నిజామాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. బ్లాక్‌ఫంగస్ సింట‌మ్స్ ఉండటంతో హైదరాబాద్‌ తీసుకెళ్లారు. గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Also Read:  పల్లె ప్రగతి పథకానికి నిధులు విడుదల చేసిన కేసీఆర్ స‌ర్కార్

కరోనా పాజిటివ్ వచ్చిన తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చా ? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..