లాక్‌డౌన్ ఎఫెక్ట్: 3.31 లక్షల పీఎఫ్ క్లైమ్స్ క్లియర్..

| Edited By:

Apr 17, 2020 | 3:18 PM

కోవిద్-19 విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా లాక్‌డౌన్‌తో భవిష్యనిధి (పీఎఫ్‌)ని ఉపసంహరించుకునేందుకు భారీగా కార్మికులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటువ్యాధుల సెక్షన్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 3.31 లక్షల పీఎఫ్ క్లైమ్స్ క్లియర్..
Follow us on

కోవిద్-19 విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా లాక్‌డౌన్‌తో భవిష్యనిధి (పీఎఫ్‌)ని ఉపసంహరించుకునేందుకు భారీగా కార్మికులు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటువ్యాధుల సెక్షన్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా సంఘటిత రంగ కార్మికులు, వేతన జీవులు దాదాపు 50 వేలమందికి పైగా దరఖాస్తులను సమర్పించారు. వీటిని మూడు నుంచి ఏడు రోజుల్లోనే పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా.. అంటువ్యాధులు ప్రబలినట్లు ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతంలోని ఉద్యోగులు తమ భవిష్యనిధి నిల్వల నుంచి 75 శాతం లేదా మూడు నెలల (మూలవేతనం, డీఏ కలిసి) వేతనం ఇందులో ఏది తక్కువైతే ఆ మొత్తం తీసుకునేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో చట్టంలోనూ సవరణ చేసింది. ఈ సెక్షన్‌ కింద తెలంగాణ రీజియన్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ 3రోజుల్లోనే పరిష్కరించినట్లు ఈపీఎఫ్‌వో వర్గాలు వెల్లడించాయి.

Also Read: మహారాష్ట్రలో.. 23 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. 

Also Read: అమెరికాలో కరోనా కరాళనృత్యం.. 24 గంటల్లో 4,491 మంది మృతి..