మహారాష్ట్రలో.. 23 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. 

| Edited By:

Apr 17, 2020 | 1:08 PM

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్రలో 23 మంది పోలీసులకు ఈ వైరస్ సోకడం సంచలనం రేపింది. ముంబై నగరంలో విధినిర్వహణలో ఉన్న 15మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని రావడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసు అధికారులతో సహా మరో 16మంది పోలీసు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. వివిధ ఆసుపత్రుల్లో చేరిన 23 మంది పోలీసులు […]

మహారాష్ట్రలో.. 23 మంది పోలీసులకు కరోనా పాజిటివ్.. 
Follow us on

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మహారాష్ట్రలో 23 మంది పోలీసులకు ఈ వైరస్ సోకడం సంచలనం రేపింది. ముంబై నగరంలో విధినిర్వహణలో ఉన్న 15మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని రావడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ రోగులను క్వారంటైన్ కు తరలించడానికి పనిచేసిన ఏడుగురు పోలీసు అధికారులతో సహా మరో 16మంది పోలీసు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. వివిధ ఆసుపత్రుల్లో చేరిన 23 మంది పోలీసులు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.

కాగా.. ప్రతీ జిల్లాలోనూ పోలీసుల కోసం ప్రత్యేకంగా మొబైల్ డిస్ ఇన్పెక్షన్ వ్యాన్ ను ఏర్పాటుచేశారు. లాక్ డౌన్ సందర్భంగా 97 మంది పోలీసులపై దాడి చేసిన 162మందిపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 46,671 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, వారిలో 9,155మందిని అరెస్టు చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన 31,296 వాహనాలను సీజ్ చేసి, ఉల్లంఘనుల నుంచి రూ.1.7 కోట్ల జరిమానాను పోలీసులు వసూలు చేశారు.

Also Read: అమెరికాలో కరోనా కరాళనృత్యం.. 24 గంటల్లో 4,491 మంది మృతి..