జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం

|

Oct 30, 2020 | 2:33 PM

అక్రమ మద్యంపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా జరగకుంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

జగ్గయ్యపేటలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యం
Follow us on

అక్రమ మద్యంపై ఏపీ పోలీసుల ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా జరగకుంగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బోర్డర్ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పీఎస్ పరిధిలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది.  మూడు చెక్ పోస్ట్‌లలో ఆరు లక్షల రూపాయల విలువైన 1000 మద్యం సీసాలను, ఒక లక్షా డెబ్బై మూడు వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో సత్తా చాటుతోన్న సిబ్బందికి రివార్డులు అందజేశారు ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ వకుల్ జిందాల్.

కాగా ఏపీలో మద్యం ధరలు అడ్డగోలుగా వున్నాయంటూ గగ్గోలు పెడుతున్న మందు ప్రియులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో మద్యం ధరలను గణనీయంగా తగ్గిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా, ప్రీమియం కేటగిరీ మద్యం ధరలను ఏకంగా 25 శాతం తగ్గించింది సర్కార్. తగ్గిన ధరలు నేటి నుంచి అంటే అక్టోబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read : 14 ఏళ్లకే తల్లైంది.. పుట్టిన బిడ్డను ఫ్రీజరులో పెట్టింది