సీఎస్‌కేతో రైనా బంధం ఇక ముగిసినట్లేనా.!

|

Sep 29, 2020 | 2:22 PM

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ సురేష్ రైనాకు స్వస్తి పలకనుందా.? ఆ జట్టుతో రైనా బంధం ముగిసినట్లేనా.? ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలతో అభిమానుల్లో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే యూఏఈ నుంచి స్వదేశానికి కూడా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తనకు, ఫ్రాంచైజీకి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అంతా […]

సీఎస్‌కేతో రైనా బంధం ఇక ముగిసినట్లేనా.!
Follow us on

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంచైజీ సురేష్ రైనాకు స్వస్తి పలకనుందా.? ఆ జట్టుతో రైనా బంధం ముగిసినట్లేనా.? ఇటీవల జరుగుతున్న పలు పరిణామాలతో అభిమానుల్లో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే యూఏఈ నుంచి స్వదేశానికి కూడా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

తనకు, ఫ్రాంచైజీకి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. అంతా బాగానే ఉందని రైనా మీడియా ముందుకు వచ్చి చెప్పినా.. సీఎస్‌కే తీసుకుంటున్న స్టెప్స్ మాత్రం ప్రతీసారి ఏదొక అనుమానాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా రైనా పేరును అధికారిక వెబ్‌సైట్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తొలగించింది. రైనాతో పాటు దుబాయ్ వెళ్లని హర్భజన్ సింగ్ పేరును కూడా జట్టు నుంచి తీసేసింది. తాను మళ్లీ ఐపీఎల్ 2020 ఆడటంపై రైనా ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసినా.. ఫ్రాంచైజీ తీసుకుంటున్న చర్యలతో అది జరిగేలా కనిపించట్లేదు. చిన్న తలా మళ్లీ వస్తాడు అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించేలా లేవు.