World-record rabbit: ప్రపంచంలోని అతిపెద్ద కుందేలు మిస్సింగ్.. ఆచూకి తెలిపిన వారికి భారీగా పారితోషకం

|

Apr 14, 2021 | 5:05 PM

ప్రపంచంలో అతిపెద్ద కుందేలు.. ఇంగ్లాండ్‌ వోర్సెస్టర్‌షైర్‌లో అది ఉంటోన్న ఇంటి నుంచి దొంగిలించబడింది. ఈ కుందేలు ప్రపంచంలోనే అతిపెద్దది

World-record rabbit: ప్రపంచంలోని అతిపెద్ద కుందేలు మిస్సింగ్.. ఆచూకి తెలిపిన వారికి భారీగా పారితోషకం
Worlds Biggest Rabbit Missing
Follow us on

ప్రపంచంలో అతిపెద్ద కుందేలు.. ఇంగ్లాండ్ వోర్సెస్టర్‌షైర్‌లో అది ఉంటోన్న ఇంటి నుంచి దొంగిలించబడింది. ఈ కుందేలు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ఘనత సాధించింది.  మిస్సింగ్ కంప్లైంట్ అందిన అనంతరం పోలీసులు దాన్ని వెతకడం ప్రారంభించారు. కాగా ఆ కుందేలు యజమాని తన అభిమాన జంతువు ఆచూకి తెలిపిన వ్యక్తికి బహుమతి ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ అవుతుంది.

శనివారం రాత్రి తన కుందేలు అపహరించినట్టు దాని యజమాని చెబుతున్నారు. కుందేలు పేరు డారియస్ అని, దాని పొడవు 129 సెంటీమీటర్లు అని.. దాన్ని వెతికి పెట్టాలని కోరుతూ వెస్ట్ ముర్సియా పోలీసులకు ఫిర్యాదు చేవారు. 129 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఖండాంతర కుందేలు అయిన డారియస్‌కు 2010 లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది.

“దయచేసి నా కుందేలును తిరిగి తీసుకురండి” అని డారియస్ యజమాని అన్నెట్ ఎడ్వర్డ్స్ దాన్ని తీసుకెళ్లినవారికి ట్విట్టర్లో విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు అది సంతానోత్పత్తి దశలో ఉన్నట్లు తెలిపింది. దాని ఆచూకి తెలిపినవారికి ఆమె లక్ష రూపాయల పారితోషకం ఇస్తానని ప్రకటించింది. ఇది జరిగి రెండు రోజులు అవుతున్నా ఎటువంటి సమాచారం లేకపోవడంతో.. పారితోషకం రెండు లక్షలకు పెంచింది.

ప్రస్తుతం, ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుందేలు ఆచూకి తెలిసినవారు సమాచారం ఇవ్వడానికి పోలీసులు ఫోన్ నంబర్‌ను విడుదల చేశారు. ఈ కుందేలు బరువు 22 కిలోల కంటే ఎక్కవ ఉంటుందట. ఒక సంవత్సరంలో ఇది 4000 క్యారెట్లకు పైగా తింటుందట.  గార్డెన్‌లో తిరుగుతుండగా దుండగులు తన కుందేలును అపహరించారని యజమాని చెబుతోంది. ‌

Also Read: పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి.