వాస్తుకు మన నిత్య జీవితంలో ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వాస్తును పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణానికి మాత్రమే కాకుండా వివిధ అంశాల్లో కూడా వాస్తు ఉంటుందని నిపుణులు అంటున్నారు. వాస్తు మన ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇంట్లో కొన్ని రకాల వాస్తు దోషాల కారణంగా అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణు అంటున్నారు. వాస్తు లోపాలు అనేక రకాల రోగాలకు కారణం అవుతాయి. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని వాస్తు మిస్టేక్స్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మీకు తెలుసా.? ఇంతకీ ఆ వాస్తు లోపాలు ఏంటి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు ఉండే చోట ఎట్టి పరిస్థితుల్లో చెత్త లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈశాన్యం దిశలో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తు నియమాల ప్రకారం బావులు లేదా కుళాయిలు వంటివి దక్షిణం, పడమర దిశల మధ్య ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా ఉంటే కుటుంబంలో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
అలాగే దక్షిణం, పడమర దిశాల్లో వాషింగ్ మెషిన్, వేష్ బేసిన్ వంటి నీరు ఉండే వాటిని అస్సలు పెట్టకూడదని అంటున్నారు. అలాగే ఈ దిశలో మందులు పెట్టడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారికి సంబంధించిన మందులను దక్షిణం వైపు పెట్టడం మంచిది కాదని చెబుతున్నారు. మందులను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెబతోంది.
ఇక ఈశాన్యం దిశలో పెద్ద పెద్ద వస్తువులను, బరువు ఎక్కువగా ఉండే వస్తువులను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఇలా ఉంచితే ఇంట్లో ఉండేవారికి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..