SBI: మీకు ఎస్‌బీఐ నుంచి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోమని మెసేజ్‌ వస్తుందా.? అయితే జాగ్రత్తగా ఉండండి..

|

Mar 03, 2021 | 11:36 AM

SBI Alert For Customers: ఇటీవల సైబర్‌ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు. మన అవగాహన లోపాన్ని, నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోని..

SBI: మీకు ఎస్‌బీఐ నుంచి క్రెడిట్‌ పాయింట్లు రిడీమ్‌ చేసుకోమని మెసేజ్‌ వస్తుందా.? అయితే జాగ్రత్తగా ఉండండి..
Follow us on

SBI Alert For Customers: ఇటీవల సైబర్‌ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన ఖాతాలోని డబ్బులను కొట్టేస్తున్నారు. మన అవగాహన లోపాన్ని, నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకోని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్‌బీఐ ఖాతాదారులను టార్గెట్‌ చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు దాడులకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే ఎస్‌బీఐ తన ఖాతాదారులను అలర్ట్‌ చేసింది. సైబర్‌ దాడులు పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండని సూచించింది. ఇక సైబర్‌ నేరగాళ్లు ఈసారి మరో సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు సమాచారం. ఖాతాదారులకు ఎస్‌బీఐ పేరుతో.. రూ.9,870 విలువైన ఎస్‌బీఐ క్రెడిట్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలని హ్యాకర్లు అనుమానాస్పద టెక్ట్స్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లో ఇచ్చిన ఓ లింక్‌ ద్వారా పాయింట్లను రిడీమ్‌ చేసుకోవాలిన సదరు సందేశం సారంశం. ఇక మీరు ఏమాత్రం ఏమర పాటుతో ఆ లింక్‌ను క్లిక్‌ చేసినా. వెంటనే ఓ నకిలీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇక పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడానికి మీరు పేరు, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పుట్టినతేదీ, కార్డ్‌ నెంబర్‌, సీవీవీ, ఎంపిన్‌ వంటి వివరాలను ఎంటర్‌ చేయమని కోరుతుంది. ఇలా మీరు ఈ సమాచారం అందిస్తారో లేదో అలా మీ ఖాతాలోని నగదు నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఈ విషయాలను న్యూ ఢిల్లీకి చెందిన సైబర్‌ పీస్ ఫౌండేషన్, సైబర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌లో ఉండే ఎస్‌బీఐ కస్టమర్లను మోసగాళ్లు టార్గెట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాబట్టి.. ఎలాంటి మెసేజ్‌లు వచ్చినా వెంటనే టెంప్ట్‌ కాకుండా ముందుగా.. అందులో ఎంత వరకు నిజం ఉందన్న విషయం తెలుసుకున్న తర్వతే ముందు అడుగు వేయడం మంచిది.

Also Read: ఒళ్ళో చంటిపాప.. వీరితో పోరాడి ఓడిన మహిళ వైరల్ అవుతున్న వీడియో : Delhi Chain snatcher stabs woman video

New Feature In WhatsApp: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన వాట్సాప్‌… ఇకపై వీడియో పంపే ముందు..

Elon Musk: భారత్‌లోకి ప్రవేశిస్తోన్న ఎలాన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ సేవలు.. ప్రీ బుకింగ్‌లు మొదలయ్యాయి.. ధర ఎంతో తెలుసా?