Optical illusion: మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి చూద్దాం..!

|

Mar 21, 2025 | 7:12 PM

వైరల్ అవుతున్న మరో ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ మీ ముందుకు వచ్చింది. ఇది మీ దృష్టి శక్తిని పరీక్షించడానికి అద్భుతమైన ఛాలెంజ్. మీరు కేవలం 10 సెకన్ల లోపే ఓ ప్రత్యేక సంఖ్యను గుర్తించాలి. మరి మీరు గుర్తిస్తారా..? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

Optical illusion: మీ మైండ్ షార్ప్ అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి చూద్దాం..!
Optical Illusion
Follow us on

మీరు చూస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్‌లో మొత్తం 70 సంఖ్యలే కనిపిస్తాయి. కానీ వాటిలో ఒక ప్రత్యేకమైన సంఖ్య దాగి ఉంది. అదే 78.. ఇది మీకు తక్షణమే కనిపించకపోవచ్చు.. ఎందుకంటే ఇది చాలా చాకచక్యంగా దాగివుంది. అయితే మీరు పూర్తిగా ఫోకస్ పెడితే ఈ విభిన్న సంఖ్యను గుర్తించగలుగుతారు. మరి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లో పాల్గొనడానికి మీరు రెడీనా..?

ఒకసారి బాగా ఫోకస్ చేసి చూడండి. మిమ్మల్ని మాయ చేసే ఈ చిత్రంలో 78 సంఖ్యను కనుగొనడానికి మీరు ప్రయత్నించండి. ఇది సాధారణంగా కనిపించదని.. మీ కళ్ళు ఓ మాయలో పడిపోవచ్చని గుర్తుంచుకోండి. కేవలం గణిత ప్రేమికులకే కాదు, మంచి పరిశీలనా శక్తి ఉన్నవారికి కూడా ఇది సరైన పరీక్ష.

Optical Illusion

మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పజిల్‌ను సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పరిష్కరించండి. సమయం చాలా విలువైనది. ఆలస్యం చేయకండి త్వరగా కనిపెట్టే ప్రయత్నం చేయండి. కౌంట్‌డౌన్ స్టార్ట్ చేద్దామా మరి..? ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది… మీకు ఇచ్చిన సమయం అయిపోయింది.

మీరు ఇప్పటికీ సంఖ్యను కనిపెట్టలేకపోయారా..? అయితే మీకోసం ఒక చిన్న హింట్.. ఇది 70ల మధ్య చిన్నగా దాగి ఉంది. బాగా ఫోకస్ చేస్తే కనిపిస్తుంది. మరీ ఎక్కువ క్లూ ఇవ్వలేం ఎందుకంటే అప్పుడు మజానే పోతుంది కదా.

ఈ పజిల్ పూర్తిగా మీ దృష్టి శక్తిని పరీక్షించేందుకు రూపొందించబడింది. చాలా మందికి మొదటి ప్రయత్నంలోనే 78 కనిపించదు.. కానీ మరికొంత సమయం తీసుకుని చూస్తే తప్పకుండా కనిపిస్తుంది.

మీరు 78 సంఖ్యను కనిపెట్టారా..? అయితే మీకు ముందుగా అభినందనలు. కనిపెట్టనివారు చింతించకండి.. మీరు లెక్కలు చేస్తుండగా మిస్ అయినా 78 సంఖ్య ఇక్కడే ఇమేజ్ లో బ్లాక్ కలర్ రౌండ్ సర్కిలో ఉంది చూడండి.