AC నీరు బయట పడుతుందా..? కొత్త చట్టాలు తెలియకపోతే తప్పదు భారీ జరిమానా, జైలు శిక్ష!

భానుడి భగభగల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి ఇంట్లోనూ ఏసీలు ఇప్పుడు అనివార్యంగా మారాయి. అయితే, విండో ఏసీలను అమర్చుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన చట్టాలను పాటించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే..! విండో ఏసీల (Window AC) ఇన్‌స్టాలేషన్‌కు సంబంధించి కొత్తగా అమలులోకి వస్తున్న కఠినమైన నిబంధన, వాటిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే జరిమానాల గురించి తప్పక తెలుసుకోవాలి. లేదంటే..

AC నీరు బయట పడుతుందా..? కొత్త చట్టాలు తెలియకపోతే తప్పదు భారీ జరిమానా, జైలు శిక్ష!
Window Ac Installation Rules

Updated on: Apr 11, 2026 | 8:00 AM

వేసవి కాలంలో ఏసీల వినియోగం పెరగడంతో ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు లేదా పాత అపార్ట్‌మెంట్లలో విండో ఏసీలను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సరైన భద్రతా నియమాలు పాటించకపోతే భారీ జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏసీ నుండి వెలువడే నీరు (Condensate water) ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై లేదా పక్క ఇళ్లపై పడటం, అలాగే సరైన సపోర్ట్ లేకుండా ఏసీని గోడకు అమర్చడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టడమే ఈ చట్టాల ముఖ్య ఉద్దేశ్యం. స్థానిక మున్సిపల్ నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు.

కొత్త నిబంధనలు, భద్రత:

చాలా మంది తమ సౌలభ్యం కోసం ఏసీలను కిటికీలకు అమర్చుకుంటారు. అయితే, భవనం వెలుపల ఏసీని అమర్చేటప్పుడు అది దృఢంగా ఉందా లేదా అనేది సరిచూసుకోవాలి. బలహీనమైన సపోర్టుతో ఉన్న ఏసీలు కింద పడితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో యజమానిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

నీటి లీకేజీ సమస్య:

ఏసీ నుండి నిరంతరం కారే నీరు బాటసారులపై లేదా పక్కవారి బాల్కనీల్లో పడటం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మున్సిపల్ చట్టాల ప్రకారం, ఏసీ నీటిని పైపు ద్వారా డ్రైనేజీకి అనుసంధానించాలి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నీటిని వదిలేస్తే స్థానిక అధికారులు భారీగా జరిమానా విధిస్తారు.

అపార్ట్‌మెంట్ సొసైటీ నిబంధనలు:

ప్రతి అపార్ట్‌మెంట్ అసోసియేషన్ లేదా సొసైటీకి భవనం బాహ్య రూపాన్ని (Façade) కాపాడటానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అనుమతి లేకుండా గోడలకు రంధ్రాలు చేయడం లేదా నిర్దేశించిన ప్రదేశంలో కాకుండా వేరే చోట ఏసీని అమర్చడం చట్టవిరుద్ధం. దీనివల్ల పొరుగువారితో వివాదాలు తలెత్తడమే కాకుండా, కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీ ఇన్‌స్టాలేషన్‌ను ఎప్పుడూ సర్టిఫైడ్ టెక్నీషియన్ ద్వారానే చేయించుకోవాలి. డ్రైన్ పైపు నీరు ఎక్కడ పడుతుందో క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఏసీని అమర్చిన గోడ బలాన్ని తట్టుకోగలదా లేదా అనేది ముందుగానే పరీక్షించాలి. సౌకర్యం కోసం పెట్టుకునే ఏసీ ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని ప్రభుత్వం ఈ నిబంధనలను రూపొందించింది. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన చిక్కుల నుండి కూడా బయటపడవచ్చు.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక భవనం పైనుంచి ఎయిర్ కండిషనర్ అకస్మాత్తుగా కిందపడటంతో, అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన తర్వాత, అటువంటి నిర్లక్ష్యం కేవలం ప్రమాదం మాత్రమే కాదని, అది ఒక నేరంగా కూడా పరిగణించబడుతుందని స్పష్టమైంది. భారత చట్టం ప్రకారం మీ నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణిస్తే, మీపై విచారణ జరపవచ్చు. సెక్షన్ 125(A)/106 BNS కింద దోషిగా తేలితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఉద్దేశం లేకపోయినప్పటికీ, నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణించిన సందర్భాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us