సంతోషంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రతీ ఒక్కరం ఆశిస్తుంటాం. ఇందుకోసం లక్ష్మీదేవీ అనుగ్రహం ఉండాలని ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. ఇందులో భాగంగానే వాస్తు శాస్త్రాన్ని సైతం పాటిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో తెలిపిన కొన్ని అంశాలతో ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాంటి కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* విండ్ చైమ్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. విండ్ చైమ్‌ల నుంచి వచ్చే మధురమైన శబ్ధం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. విండ్ చైమ్‌ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటుంది.
* ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచి జరుగుతుంది. లాఫింగ్ బుద్ధ ఇంటికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ కొనసాగుతుంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధను ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ సంతోషం వెల్లివిరుస్తుంది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
* వెదురు మొక్కను ఇంట్లో ఏర్పాటు చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో వెదురు మొక్క కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వెదురు మొక్క వల్ల సంపద వస్తుంది. అలాగే ఇంట్లో తాజాదనం లభిస్తుంది. ఇంట్లో వెదురు మొక్కను ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు.
* వాస్తు శాస్త్రం ప్రకారం చేపలను అదృష్టానికి సూచికగా చెబుతారు. ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్సుకు సూచికగా చెబుతారు. అక్వేరియం ఉన్న ఇంట్లో, సంపద, శ్రేయస్సు పెరుగుతుందని, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు. అక్వేరియంను ఇంటికి ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర దిశ కుబేరుని దిశగా పరిగణిస్తారు, కాబట్టి ఈ దిశలో అక్వేరియం ఉంటేమేలు జరుగుతుందని చెబుతారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..