ప్రతీ ఒక్కరికీ కలలు రావడం సర్వసాధారణం. అయితే కలలో మనకు కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో కొన్ని కలలు మంచివి అయితే మరికొన్ని చెడుకు సంకేతమని పండితులు సైతం చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రంలోనూ ఇందుకు సంబంధించి పలు విషయాలను చెబుతున్నారు. కలలో కొన్ని రకాల వస్తువులు కనిపించడం ద్వారా చెడుకు సంకేతంగా భావించాలని అంటారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కలలో హింసాత్మక జంతువులు కనిపిస్తే మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి జంతువులు వెంటాడుతున్నట్లు కనిపిస్తే ఆర్థిక నష్టానికి సంకేతమని అంటున్నారు. వృధా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. కలలో ఒకవేళ తుఫాను, సుడిగాలి వంటివి కనిపిస్తే దుదృష్టం వెంటాడే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇవి చెడుకు సంకేతంగా చెప్పొచ్చు. పక్షులు ఎగురుతున్నట్లు కనిపించినా అది చెడుకు సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు.
స్వప్నశాస్త్రం ప్రకారం కలలో పక్షులు, ముఖ్యంగా కాకి కనిపిస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇక ఒకవేళ కలలో పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే అది వ్యక్తి ఇంటిలో కుటుంబ అసమ్మతికి సంకేతంగా భావించాలి. ఇలాంటి కలలు కనిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. కలలో రక్తస్రావం జరిగినట్లు కనిపిస్తే. దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతంగా భావించాలని అంటున్నారు.
ఒకవేళ కలలో చీకటి మేఘాలు కనిపించినా, ఆకాశం నల్లగా మారినట్లు కనిపించినా.. అది మంచిది కాదని అంటున్నారు. జీవితంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు కలలో కనిపిచండం కూడా మంచిది కాదని అంటున్నారు. ఇది సమీప కాలంలో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనేందుకు సంకేతంగా చెప్పొచ్చు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..