Gas Stove: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తుంటే బయటి సహాయం లేకుండా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. సాధారణ స్టాప్లర్ పిన్, నోస్ ప్లయర్ ఉపయోగించి, బర్నర్ హోల్స్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయి. గ్యాస్ మంట మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.

Gas Stove: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..
Telugu News

Updated on: Apr 06, 2026 | 9:31 PM

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మంట తక్కువగా రావడం వల్ల మహిళలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వంట ఆలస్యం కావడమే కాకుండా గ్యాస్ కూడా వృథా అవుతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మెకానిక్‌ను పిలవాలని అనుకుంటాం. కానీ దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ రిపేర్ కోసం మనకు కేవలం ఒక స్టాప్లర్ పిన్, నోస్ ప్లయర్ ఉంటే సరిపోతుంది.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

ముందుగా భద్రతా చర్యల్లో భాగంగా గ్యాస్ సిలిండర్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఒక స్టాప్లర్ పిన్‌ను తీసుకుని, దాని రెండు వైపులా వంగి ఉన్న భాగాలను నోస్ ప్లయర్ సహాయంతో స్ట్రెయిట్‌గా చేసి ఒక సన్నని తీగలా మార్చుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైనున్న బర్నర్‌లు, స్టాండ్‌లను తీసివేసి, స్టవ్‌ను జాగ్రత్తగా తలకిందులుగా తిప్పాలి. ఇలా చేసినప్పుడు బర్నర్‌లకు గ్యాస్ సరఫరా చేసే పైపులు, వాటి చివరన ఉండే చిన్న రంధ్రాలు (హోల్స్) మనకు కనిపిస్తాయి.

సాధారణంగా ఈ రంధ్రాలలో ధూళి లేదా ఇతర వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే గ్యాస్ ప్రవాహం తగ్గి మంట తక్కువగా వస్తుంది. ఇప్పుడు నోస్ ప్లయర్‌తో పట్టుకున్న స్టాప్లర్ పిన్‌ను ఆ చిన్న రంధ్రంలోకి పంపి, మూడు నాలుగు సార్లు లోపలికి బయటకి కదపడం ద్వారా పేరుకుపోయిన మురికిని తొలగించవచ్చు. ఇలా అన్ని బర్నర్‌ల హోల్స్‌ను శుభ్రం చేసిన తర్వాత, స్టవ్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చి భాగాలన్నింటినీ అమర్చాలి. చివరగా గ్యాస్ ఆన్ చేసి వెలిగిస్తే మంట మళ్ళీ హై ఫ్లేమ్‌లో రావడం గమనించవచ్చు.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

Loading...
Unable to load recommendations.
Follow Us