Garlic Farming: వెల్లుల్లి సాగుతో ఏడాదికి 10 లక్షల సంపాదన..! తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..

|

Sep 27, 2021 | 7:14 PM

Garlic Farming: భారతదేశంలో చాలామందికి వ్యవసాయమే జీవనాధారం. ఇప్పటికి దేశ జీడీపీలో దీని వాటా అధికంగా ఉంటుంది.

Garlic Farming: వెల్లుల్లి సాగుతో ఏడాదికి 10 లక్షల సంపాదన..! తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి..
Garlic Farming
Follow us on

Garlic Farming: భారతదేశంలో చాలామందికి వ్యవసాయమే జీవనాధారం. ఇప్పటికి దేశ జీడీపీలో దీని వాటా అధికంగా ఉంటుంది. అయితే చాలామంది రైతులు పెట్టుబడి తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా ఉండే పంటలపై ఆసక్తి కనబరుస్తారు. తాజాగా వెల్లుల్లి సాగు ఇదే కోవాలోకి వస్తుంది. వెల్లుల్లి అంటే మనకు ఆయుర్వేదమే గుర్తుకువస్తుంది. ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంగా వాడుతారు. అంతేకాదు ఇది లేనిదే భారతీయులు వంట కూడా చేయరు. అలాంటి వెల్లుల్లి సాగుతో రైతులు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

వెల్లుల్లి సాగు ప్రత్యేకత
వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం.. వెల్లుల్లి సాగు ఎక్కువగా నేలరకంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మట్టిని పరీక్షించడం చాలా ముఖ్యం. ఎక్కువగా రైతులు వర్షాకాలం ముగిసిన తర్వాత వెల్లుల్లి సాగును ప్రారంభిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ శాస్ర్తవేత్తల సూచన ప్రకారం నడుచుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు.

వెల్లుల్లి సాగు చిట్కాలు
1. వెల్లుల్లి సాగుకు దీని మొగ్గలను ఉపయోగిస్తారు.
2. మొక్కకు మొక్కకు మధ్య10 సెంటీమీటర్ల దూరం ఉండాలి.
3. వెల్లుల్లి ఏ పొలంలోనైనా సాగు చేయవచ్చు కానీ అందులో నీరు నిలవకూడదు.
4. ఈ పంట సుమారు 5-6 నెలల్లో చేతికొస్తుంది.
5. ఒక హెక్టార్ పొలంలో సుమారు 5 క్వింటాళ్ల వెల్లుల్లి మొగ్గలు నాటవచ్చు.
6. ఒక హెక్టార్‌కి 120 నుంచి150 క్వింటాళ్ల ఉత్పత్తి లభిస్తుంది.
7. సగటున 130 క్వింటాళ్ల ఉత్పత్తి లభిస్తుంది.
8. వెల్లుల్లి విత్తనాల కోసం సమీపంలోని ఏదైనా వెల్లుల్లి సాగుదారుని సంప్రదించాలి.
9. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.

ఎంత ఖర్చు.. ఎంత లాభం
వెల్లుల్లి సాగుతో లాభాలు బాగుంటాయి. ఒక హెక్టార్‌కి సుమారుగా130 క్వింటాళ్ల వెల్లుల్లి ఉత్పత్తి చేయవచ్చు. సాధారణంగా కిలో వెల్లుల్లి రూ.30 నుంచి 50 కి అమ్ముతారు. మీ పంటను రూ.40 కి విక్రయిస్తే 130 క్వింటాళ్లు ఉత్పత్తి చేయడం ద్వారా మీరు రూ.5.2 లక్షలు సంపాదిస్తారు. ఇందులో రూ.1.25 లక్షల ఖర్చు తీసివేసినా మీకు ఇంకా రూ.4 లక్షల లాభం ఉంటుంది.

World Health Organization: కరోనా మూలాలపై మరోసారి పరిశోధన.. సిద్దమవుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చైనా వైఖరి ఇదేనా?

Telangana strategy: వామపక్ష తీవ్రవాదంపై తెలంగాణ ఉక్కుపాదం.. బహుముఖ వ్యూహమే విజయ రహస్యం.. ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు..

Gold Rings: పార్టీలో సభ్యులను చేర్చితే బంగారు ఉంగరాలు బహుమతి.. ఆ పార్టీ నేత ఆసక్తికర ప్రకటన