Vastu Tips: చిన్న చిన్న వాస్తు చిట్కాలే.. కానీ జీవితాన్ని మార్చేస్తాయి..

భారతీయులను, వాస్తును విడదీసి చూడని పరిస్థితి. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తు కచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే కలర్స్‌ వరకు ప్రతీ విషయం వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి నిర్మాణంలో వాస్తును పాటించే వారు ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా..

Vastu Tips: చిన్న చిన్న వాస్తు చిట్కాలే.. కానీ జీవితాన్ని మార్చేస్తాయి..
Vastu Tips
Follow us

|

Updated on: May 25, 2024 | 2:52 PM

భారతీయులను, వాస్తును విడదీసి చూడని పరిస్థితి. మరీ ముఖ్యంగా హిందువులు వాస్తు కచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఇంటి పునాది నుంచి మొదలు ఇంట్లో గోడలకు వేసుకునే కలర్స్‌ వరకు ప్రతీ విషయం వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి నిర్మాణంలో వాస్తును పాటించే వారు ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సంపద పెరుగుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిన్న చిన్న వాస్టు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రంలో చీపురుకు ప్రత్యేక స్థానం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మంది ఇంటిని ఊడ్చిన తర్వాత చీపురును తలుపు దగ్గరే ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం ఇలా చేయకూడదని చెబుతున్నారు. చీపురును కాళ్లకు తాకని ప్రదేశంలో ఉంచాలి. అలాగే చీపురు పెట్టే స్థలంపై ఎలాంటి బరువైన వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక ఇంట్లో ఉండే మతపరమైన పుస్తకాలను తప్పుడు దిశలో ఉంచడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు పండితులు చెబుతున్నారు. అందుకే పుస్తకాలను, గ్రంధాలను ఎల్లప్పుడూ ఇంటి పశ్చిమ దిశలో ఉంచాలి. మతపరమైన పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌ రూమ్‌లో ఉంచకూడదు.

* ఇక ఇంట్లో పూజ గదిలో ప్రతీ రోజూ కచ్చితంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడమే కాకుండా గంటను మోగించాలని చెబుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా భార్యభర్తలిద్దరూ బిజీగా మారడంతో కొందరు పూజ చేయడం కూడా మానేశారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇంట్లో గోడలపై ఏర్పాటు చేసుకునే ఫొటోల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్టర్స్‌లో చెట్లు, నదులు వంటి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవి ఉండాలి. అలా కాకుండా క్రూర మృగాలు, యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు లేకుండా చూసుకోవాలి.

* పడుకునే దిశ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా దక్షిణం వైపు తల పెట్టి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.

* ఇంటిలో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్యం దిశలో తులసి మొక్కను నాటి ప్రతీ రోజూ నీటితో పాటు కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోయి, ప్రశాంతత లభిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్