
Video Goes Viral : ప్రకృతి పరంగా వచ్చిన శత్రుత్వం కూడా ఆకలి తీర్చేసమయంలో మిత్రుత్వంగా మారుతుందని అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తున్నాం.. తాజాగా ఓ కోడి తనకు ఆజన్మ శత్రువైన కుక్కకి తన శక్తికి మించి సాయం అందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. కుక్క ఆకలి తీర్చిన కోడిని నెటిజన్లు ప్రశంసల వర్షంతో ముంచేస్తున్నారు.
నిజానికి కోడి ని చూస్తే కుక్క వదిలి పెట్టదు.. దానిని వెంటాడి.. వేటాడుతుంది.. అవకాశం ఉంటె నోట కరుచుకుని తీసుకుని వెళ్లి ఆహారంగా తినేస్తుంది.. అలాంటి జాతి వైరం కోడి, కుక్కది. అయితే కోడి ఆ జాతి వైరాన్ని మరచి తన శక్తి మించి సాయం చేసింది.. కుక్కని చూస్తే పారిపోయే కోడి.. ఆ కుక్కని తనపై ఎక్కించుకుంది. కుక్క ఆకలి తీర్చేందుకు కోడి సాహసమే చేసింది.
అలా కోడిపై ఎక్కి ఆహారం తింటున్న కుక్క వీడియో ఒక దానిని భారత అటవీశాఖ అధికారి తన ట్విట్టర్ లో షేర్ చేశారు. రాజకీయ నాయకులు ఇలాగే శత్రుత్వం మరచి కలిసిపోతే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆ వీడియో కి ఓ కాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈవీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ తో స్పందన తెలియజేస్తున్నారు. పక్షులు, జంతువులకున్న మనసు మనుషులకు లేదని ఓ యూజర్ కామెంట్ చేస్తే వారిదే నిజమైన స్నేహం అంటూ మరొకరు అంటున్నారు. అంతేకాదు ఇటువంటి వీడియోలను చూసైనా మనిషి బుద్ధి తెచ్చుకోవాలని… మనిషి నేచర్ కు మేలు చేస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: