Lithium: టన్ను లిథియం ధర రూ. 57 లక్షలు.. ఎందుకంత డిమాండ్‌ తెలుసా.?

|

Oct 03, 2024 | 4:24 PM

లిథియం చాలా తేలికైన లోహం. దీని సాంద్రత నీటి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది మాత్రమే. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో లిథియంను ఉపయోగిస్తారు. లిథియంను ఉపయోగించడం వల్ల తక్కువ మొత్తంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, లిథియంకు కూడా డిమాండ్ పెరుగుతోంది...

Lithium: టన్ను లిథియం ధర రూ. 57 లక్షలు.. ఎందుకంత డిమాండ్‌ తెలుసా.?
Lithium
Follow us on

లిథియం.. ఇటీవల ఈ మెటల్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. వైట్‌ గోల్డ్‌గా పిలుచుకునే లిథియంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాముఖ్యత పెరుగుతోన్న ప్రస్తుతం తరుణంలో లిథియంకు డిమాండ్ పెరుగుతోంది. ఒక టన్ను లిథియం ధర అక్షరాల రూ. 57 లక్షలని మీకు తెలుసా.? ఇంతకీ ఈ లోహం అంత ఖరీదు ఎందుకు.? దీనికి అంత డిమాండ్‌ ఉండడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లిథియం చాలా తేలికైన లోహం. దీని సాంద్రత నీటి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది మాత్రమే. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల్లో లిథియంను ఉపయోగిస్తారు. లిథియంను ఉపయోగించడం వల్ల తక్కువ మొత్తంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, లిథియంకు కూడా డిమాండ్ పెరుగుతోంది .

లిథియం-అయాన్‌ బ్యాటరీలను స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఓ రేంజ్‌లో పెరుగుతుండడం కూడా లిథియం డిమాండ్‌ పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ఇక లిథియం – అయాన్ బ్యాటరీలను సౌర శక్తి, విండ్‌ పవర్ వంటి వాటిని నిల్వచేయడానికి ఉపయోగిస్తారు. పునరుత్పాదక ఇంధన వినియోగం పెరగడం కూడా లిథియంకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

లిథియంకు పెరుగుతోన్న డిమాండ్ నేపథ్యంలో దీనిని బంగారంతో పోల్చుతున్నారు. లిథియం అరుదైన లోహం, దీని లభ్యత పరిమితంగా ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఇక టన్ను లిథియం ధర సుమారు రూ. 57.36 లక్షలుగా ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా లిథియం డిమాండ్ 500 శాతం పెరుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..