Anand Mahindra: ‘చిలిపి ముద్దు’పై స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. భర్త చేసిన పనికి అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడంటూ..

|

Feb 23, 2021 | 10:45 AM

సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మహీంద్ర.. 'హా.. హా (నవ్వులు). ఈ వీడియోలో ఉన్న మహిళను నేను 'వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌'గా నామినేట్‌ చేస్తున్నాను. అంతేకాదు.. ఒకవేళ ఆ భర్త..

Anand Mahindra: చిలిపి ముద్దుపై స్పందించిన ఆనంద్‌ మహీంద్ర.. భర్త చేసిన పనికి అతను ఆ అవకాశాన్ని కోల్పోయాడంటూ..
Follow us on

Anand Mahindra Tweet On ‘Zoom Call’: ఓ వ్యక్తి ఎంతో ఆసక్తిగా జూమ్‌ కాల్‌లో జీడీపీ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ సమయంలోనే అతని భార్య సీన్‌లోకి ఎంటరై భర్తకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన భర్త.. వాట్‌ నాన్‌సెన్స్‌ అంటూ కోపగించుకున్నాడు. గత రెండు రోజులుగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
తాజాగా ఈ వీడియోపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మహీంద్ర.. ‘హా.. హా (నవ్వులు). ఈ వీడియోలో ఉన్న మహిళను నేను ‘వైఫ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నామినేట్‌ చేస్తున్నాను. అంతేకాదు.. ఒకవేళ ఆ భర్త హ్యాపీగా ఫీలై ఉంటే నేను ఈ జంటను ‘కపుల్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నామినేట్‌ చేసేవాడిని. కానీ అతను తన భార్య ముద్దు పెడుతోన్న సమయంలో చూపించిన చిరాకు కారణంగా ఆ అవకశాన్ని కోల్పోయాడు’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవడం కొనసాగుతూనే ఉంది. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ను చూసిన కొందరు నెటిజెన్లు ‘అవార్డుకు ఆ మహిళ 100 శాతం సరైన వ్యక్తి’, ‘అతను లక్కీ భర్త’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు ఏలా తీసుకోవాలో తెలుసా.. అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్..