తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డు.. వినూత్న రీతిలో వివాహ ఆహ్వానం పలుకుతున్న వధూవరులు..

ఔను...ఆ ఇద్దరు ఇష్టపడ్డారు.. వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనమే ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తి నలుగురికి తెలిసేలా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేశారు. విచిత్రమైన వెడ్డింగ్ కార్డుతో ఔరా అనిపించారు.

తమ వృత్తిని తెలిపే వెడ్డింగ్ కార్డు.. వినూత్న రీతిలో వివాహ ఆహ్వానం పలుకుతున్న వధూవరులు..
Tablet Sheet Wedding Card

Edited By:

Updated on: Feb 01, 2026 | 8:18 PM

ఔను…ఆ ఇద్దరు ఇష్టపడ్డారు.. వారిద్దరి ప్రొఫెషన్ కూడా ఒకటే.. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ఒకే విధంగా ఆలోచిస్తారనే దానికి నిదర్శనమే ఈ వెడ్డింగ్ కార్డు. తాము ఏ వృత్తిలో స్థిరపడ్డామనే విషయాన్ని అందరికీ తెలిసేలా ఏదో ఒకటి చేయాలి అని అనుకొని వినూత్నంగా ఆలోచించారు. తమ ఆలోచన విధానానికి అనుగుణంగా తమ వృత్తి నలుగురికి తెలిసేలా వెడ్డింగ్ కార్డును డిజైన్ చేశారు. విచిత్రమైన వెడ్డింగ్ కార్డుతో ఔరా అనిపించారు.

అది చూసిన వారంతా టాబ్లెట్ షీట్ అనుకున్నారు.. కానీ మొత్తం క్షుణ్ణంగా చదివితే కానీ అది వివాహ ఆహ్వాన పత్రిక అని అర్థం కాదు.. వధూవరులు ఇద్దరు ఫార్మా రంగంలో పనిచేస్తూ ఉండడం.. ఇష్టమైన వృత్తి ఒకవైపు, మరోవైపు ఇద్దరి మధ్య అనురాగం కలిపి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకు వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న పెళ్లి పత్రిక ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామం ఉబ్బల జయరాజు, జానకమ్మల కుమార్తె శిరీష అనే యువతి M ఫార్మసీ పూర్తి చేసి విజయవాడలో ఉద్యోగం చేస్తుంది. తనకు తల్లి తండ్రులు పెళ్లి కుదర్చడంతో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. పెళ్లికి శుభలేఖలు ముద్రించాలి. తన పెళ్లి పత్రికను వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి గౌరవంగా రూపొందించి అందరినీ ఆకట్టుకునే విధంగా చేసింది ఆ యువతి. ఆ పెళ్లి పత్రికను చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా టాబ్లెట్ షీట్ అని భ్రమపడే విధంగా ఉంది.

ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శిరీష కు కాబోయే భర్త కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. వధువు, వరుడు ఇద్దరు ఫార్మా రంగానికి చెందిన వారు కావడంతో, తమ వివాహ ఆహ్వాన పత్రిక కూడా అదే శైలిలో ఉండాలని డిఫరెంట్ ఆలోచన చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…