Workouts: ఆటైంలో వ్యాయామం చేస్తే బెటర్.. న్యూయర్క్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

|

Jan 23, 2022 | 11:59 AM

Health Tips: బిజీ రొటీన్‌ లైఫ్‌లో వ్యాయామానికి సమయం దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజులో ఎప్పుడు వ్యాయామం చేయాలి అనేది చాలా మంది ముందున్న

Workouts: ఆటైంలో వ్యాయామం చేస్తే బెటర్.. న్యూయర్క్ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
exercise
Follow us on

Morning Exercise: బిజీ రొటీన్‌ లైఫ్‌లో వ్యాయామానికి సమయం దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజులో ఎప్పుడు వ్యాయామం చేయాలి అనేది చాలా మంది ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది. దీనికోసం గత మూడేళ్లుగా న్యూయార్క్ శాస్త్రవేత్తలు కొందరు పరిశోధనలు చేస్తున్నారు. దీని ప్రకారం, ఉదయం వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు తేలిందంట. ఉదయం వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ మంది బరువు కూడా బాగానే తగ్గారని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రకటించారు.

2020 పరిశోధన ప్రకారం, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో రోజుకు మూడు సార్లు వ్యాయామం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని తెలిందంట. అదే వ్యక్తులు మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేసినప్పుడు, వారి రక్తంలో చక్కెర మరింత తగ్గిందంట. ఈ పరిశోధనలన్నీ మానవులు, ఎలుకలపై చేసినట్లు ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ప్రొఫెసర్ లీసా మాట్లాడుతూ, ‘పరిశోధన ఇంకా కొనసాగుతోందని, పగటిపూట వ్యాయామం చేయడంతోనే బెటర్ రిజల్ట్స్ ఉన్నట్లు తేలిందని’ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అనే మందిలో కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం 2 శాతం నుంచి 15 శాతం చొప్పున పెరుగుతోందని ఈ పరిశోధనలో తేలింది.

కణాలు పగలు కన్నా రాత్రి భిన్నంగా పనిచేస్తాయి..
ప్రోఫెసర్ లీసా మాట్లాడుతూ, శరీరంలోని కణాలు పగలు, రాత్రి సమయాల్లో వేర్వేరుగా పనిచేస్తాయి. శరీరంలోని జీవక్రియలు ఒక్కో దశలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. వ్యాయామం అంశం కూడా ఇటీవలి పరిశోధనలో చేర్చాం’ అని ఆమె పేర్కొన్నారు.

Also Read: Corona Third Wave: థర్డ్ వేవ్ మరణాల్లో 60 శాతం మంది వారే.. తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ 4 టెస్టులు చేయిస్తే బెటరంటోన్న నిపుణులు