Blood Sugar: డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎప్పుడు వ్యాయామం చేయాలి?.. వైద్య అధ్యయనాల్లో ఏం తేలిందంటే..

|

Nov 08, 2022 | 10:51 AM

శరీరం చురుకుగా ఉంటే.. ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. ఒత్తిడి మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు శరీరం చురుకుగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. అయితే.. మధుమేహం అదుపులో ఉండాలంటే ఉదయం పూట వ్యాయామం చేసే బదులు పగటిపూట చేయండి. ఎందుకంటే..

Blood Sugar: డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎప్పుడు వ్యాయామం చేయాలి?.. వైద్య అధ్యయనాల్లో ఏం తేలిందంటే..
Diabetic Patients Workout
Follow us on

డయాబెటిక్ బాధితులకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి.. ఆహారంతో పాటు శరీరానికి శ్రమ పెట్టడం అంటే కొంత వ్యాయామం చేయండ తప్పనిసరి. శరీరం చురుకుగా ఉంటే.. ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. ఒత్తిడి మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు శరీరం చురుకుగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మధుమేహం అదుపులో ఉండాలంటే వ్యాయామమే చేయడం ఒక్కటే కాదు.. ఆ వ్యాయమం ఏ సమయంలో చేస్తే మంచిదో తెలిసి ఉండాలి. డయాబెటిక్ పేషెంట్లు వ్యాయామం చేయడం ద్వారా బ్లడ్ షుగర్ ని సులువుగా నియంత్రణలో ఉంచుకోవచ్చని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ బాధితులు ఏ సమయంలో వ్యాయామం చేయాలో తెలుసుకుందాం.. అంతేకాదు వ్యాయామం రక్తంలో చక్కెరకు ఎలా సంబంధం కలిగి ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం

డయాబెటిక్ బాధితులు ఏ సమయంలో వ్యాయామం చేయాలి?

డయాబెటిక్ పేషెంట్లు నిర్దిష్ట సమయంలో వర్కవుట్స్ చేస్తే రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించవచ్చు. డయాబెటోలోజియాలో ప్రచురించబడిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో డాక్టర్ జెరోయెన్ వాన్ డెర్ వెల్డే నేతృత్వంలోని ఒక అధ్యయనం ప్రకారం.. ఉదయం, సాయంత్రం.. రోజు చివరి భాగంలో చేసే వ్యాయామం  కంటే మధ్యాహ్న సమయంలో చేసే శారీరక శ్రమ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. పగటిపూట వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించవచ్చని తేల్చారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వారానికి 150 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఏరోబిక్ వ్యాయామం శరీర కణాల ఇన్సులిన్ సెన్సిటివిటీ, బ్లడ్ గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌ను మెరుగుపరుస్తుంది. పగటిపూట వ్యాయామం చేయడం వల్ల కండరాలు సక్రమంగా పనిచేసేందుకు శక్తి లభిస్తుంది. డైటీషియన్లు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఒక వ్యక్తికి ఎంత కండరాల్లో శక్తి ఉంటే.. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో అది ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు.

వ్యాయామం, రక్తంలో చక్కెర మధ్య సంబంధం ఏంటి?

ఉదయం కంటే మధ్యాహ్నం 2-6 గంటల మధ్య వ్యాయామం చేయడం చాలా మంచిదని భావిస్తారు వైద్యులు. వ్యాయామం, రక్తంలో చక్కెర మధ్య ప్రధాన సంబంధం ఉంది. ఎందుకంటే మన శరీర కోర్ ఉష్ణోగ్రత ఉదయం కంటే సాయంత్రం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల, సాయంత్రం శరీరాన్ని వేడెక్కడానికి తక్కువ సమయం పడుతుంది. ఇది కాకుండా, మన కండరాలు పగటిపూట ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు పగటిపూట వ్యాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం