Urine Infection: మూత్రం రంగు మారి… వాసన వస్తుందా అయితే మీ పని గోవిందా..?

|

Mar 06, 2023 | 2:35 PM

యూరిన్ పాస్ చేసేటప్పుడు మామలుగా వైట్ కలర్‌లోనే ఉంటుంది. మరీ పచ్చగా వచ్చినా.. యూరిన్ స్మెల్ వచ్చినా.. యూరిన్ బుడగలు బుడగలుగా వచ్చినా అస్సలు మంచిది కాదు.

Urine Infection: మూత్రం రంగు మారి... వాసన వస్తుందా అయితే మీ పని గోవిందా..?
Urine
Follow us on

ప్రజంట్ జనాలకు హెల్త్‌పై ఫోకస్ పెరిగింది. కరోనా అనంతరం అందరూ డైట్‌ మెయింటైన్ చేస్తున్నారు. వ్యాయామాలు చేస్తున్నారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య ఉన్నా.. డాక్టర్ వద్దకు వెళ్తున్నారు.  ఈ క్రమంలోనే కొందరు యూరిన్ రంగు మారగానే హైరానా పడిపోతున్నారు. తమకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అని మదనపడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు. మాములుగా యూరిన్ రిలీజ్ చేసేటప్పుడు పసుపు రంగులో కనబడితే.. అది మంచి లక్షణం కాదని మంతెన వివరించారు. ఈ ఇబ్బంది పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. బాత్రూంకి ఎక్కువ వెళ్లాల్సి వస్తుందని వారు మంచినీళ్లు తక్కువ తాగడం ఇందుకు ఒక రీజన్. వాటర్ తక్కువ తాగేవాళ్లకి ఎక్కువగా మూత్రం పచ్చగా వస్తుంది.

కిడ్నీలు లోపల గంటకు 2 సార్లు 5 లీటర్ల రక్తాన్ని వడకడతాయ్. శరీరంలో నీటి శాతం తక్కువ ఉన్నప్పుడు.. కిడ్నీలు వడకట్టగా వచ్చిన నీటిని.. బయటకు పంపకుండా లోపలే ఉంచుతాయ్. వడకట్టగా వచ్చిన వ్యర్థాలను తక్కువ మూత్రంతో మాత్రమే బయటకు పంపుతాయి. ఈ తక్కువ మోతాదు మూత్రంలో యూరియా, యూరిక్ యాసిడ్, టాక్సిన్స్, అదనపు సాల్ట్, అదరపు పొటాషియం, డెడ్ సెల్ వేస్ట్, లోపలికి వెళ్లిన కెమికల్ వేస్ట్, మనం వేసుకున్న మెడిసిన్‌కు సంబంధించిన కెమికల్ వేస్ట్ మొదలగునవి ఉంటాయ్. పచ్చని మూత్రం పాస్ చేయడం వల్ల.. మూత్ర నాళాల అంచుల్లో ఉండే సెల్స్ ఇరిటేట్ అవుతాయ్. అందుకే మూత్ర విసర్జన అనంతరం మంటగా ఉంటుంది.

ఎక్కువ రోజుల ఇలానే మూత్రం వస్తే.. వారికి కిడ్నీల్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లోపల యూరిక్ యాసిడ్ లాంటి వ్యర్థాలు పేరుకునే అవకాశాలు ఉంటాయ్. బాడీలో ఇన్‌ఫెక్షన్ వచ్చే చాన్స్ ఉంటుంది. యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ రావొచ్చు. అందుకే మూత్రం మరీ పచ్చగా ఉన్నా, మూత్రం వాసన వచ్చినా, మూత్రం బుడగలు బుడగలుగా ఉన్నా కూడా మంచిది కాదని డాక్టర్ మంతెన తెలిపారు. మూత్రం తెల్లగా, దారగా వస్తేనే మంచిదని వివరించారు. వాటర్ ఎక్కువ తాగడమే ఈ సమస్యలకి పరిష్కారమని తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)