ఆకస్మికంగా బరువు తగ్గతున్నారా..? వామ్మో.. ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..

|

Jul 19, 2024 | 12:59 PM

కొందరు ఎంత ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో బరువు తగ్గలేకపోతున్నారు. అయితే, కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని అనుభవిస్తారు. ఇది కొన్ని వ్యాధుల సంకేతం అని మీకు తెలుసా?.. తెలియకపోతే ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

ఆకస్మికంగా బరువు తగ్గతున్నారా..? వామ్మో.. ఈ ప్రమాదకర వ్యాధులకు సంకేతం కావొచ్చు..
Unexplained Weight Loss
Follow us on

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా బరువు పెరుగుట లేదా ఊబకాయం అనేది చాలా మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ సమస్యగా మారింది.. చాలా అనారోగ్య సమస్యలకు ఊబకాయమే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆహారంలో మార్పుల నుండి తీవ్రమైన వ్యాయామం వరకు.. అన్ని రకాలుగా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ.. ఆశించిన స్థాయిలో బరువు తగ్గడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే.. దీనికి విరుద్ధంగా, కొంతమంది ఏమీ చేయనప్పటికీ అకస్మాత్తుగా గణనీయమైన బరువు తగ్గడాన్ని అనుభవిస్తారు. ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది.. కొన్ని వ్యాధుల లక్షణాల హెచ్చరిక అని వైద్యులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి ఎటువంటి ప్రయత్నం లేకుండా అధికంగా బరువు తగ్గడం అనేది ఆనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అవసరం..

ఆకస్మికంగా బరువు తగ్గడం కూడా ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.. అవేంటో చూడండి..

మధుమేహం: ఆకస్మికంగా బరువు తగ్గడం మధుమేహం సాధారణ లక్షణం. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు, అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఈ సందర్భంలో, బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

అల్సర్లు: పొట్టలో పుండ్లు లేదా అల్సర్లతో బాధపడేవారిలో కూడా బరువు తగ్గడం సర్వసాధారణం.

డిప్రెషన్: కొందరిలో విపరీతమైన దుఃఖం, నిస్పృహ, డిప్రెషన్ వంటివి అనుకోకుండా బరువు తగ్గడానికి దారితీస్తాయి.

క్యాన్సర్: రొమ్ము, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, అండాశయం, పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్‌లతో బరువు తగ్గడం కూడా సంభవించవచ్చు.

థైరాయిడ్: కొందరిలో థైరాయిడ్ ప్రారంభ దశలో కూడా అధిక బరువు తగ్గడం జరుగుతుంది.

కావున.. ఆకస్మికంగా బరువు తగ్గితే వైద్యులను సంప్రదించడం మంచిది.. లేకపోతే మున్ముందు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..