Health: బ‌ద్ద‌ల‌య్యే త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి వెంట‌నే రిజ‌ల్ట్‌..

| Edited By: Anil kumar poka

Jan 12, 2022 | 8:37 AM

Health: మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. కాస్త ఒత్తిడి పెరిగినా, ఎండ‌లో న‌డిచినా ఇలా శ‌రీరంపై ఎలాంటి ఒత్తిడి ప‌డినా మొద‌ట త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే..

Health: బ‌ద్ద‌ల‌య్యే త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి వెంట‌నే రిజ‌ల్ట్‌..
Follow us on

Health: మ‌న‌లో చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి ఒక‌టి. కాస్త ఒత్తిడి పెరిగినా, ఎండ‌లో న‌డిచినా ఇలా శ‌రీరంపై ఎలాంటి ఒత్తిడి ప‌డినా మొద‌ట త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే మ‌న‌లో చాలా మంది త‌ల‌నొప్పి రాగానే టీ తాగ‌డం లేదా, ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇలా ప్ర‌తీసారి టీ తాగినా, ట్యాబ్లెట్ వేసుకున్నాఆరోగ్యానికి చెడు చేస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి త‌ల‌నొప్పి అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గించుకునేది ఎలా అనేగా మీ సందేహం. దానికి ఓ మార్గ‌ముంద‌డోయ్‌.. కొన్ని చిట్కాలు పాటించ‌డం ద్వారా త‌ల‌నొప్పి త్వ‌ర‌గా త‌రిమికొట్ట‌వ‌చ్చు. ఇంత‌కీ ఆ చిట్కాలేంటంటే..

* కొన్ని సంద‌ర్భాల్లో స‌రిప‌డ నీరు తాగ‌క‌పోయినా త‌ల‌నొప్పి వ‌స్తుంది. కాబ‌ట్టి త‌ల‌నొప్పిగా అనిపించిన‌ప్పుడు అన‌వ‌స‌రంగా ట్యాబ్లెట్స్ జోలికి పోకుండా ముందు బాగా నీటిని తాగి ప్ర‌శాంతంగా కాసేపు క‌ళ్లు మూసుకుంటే క్ష‌ణాల్లో ఫ‌లితం క‌నిపిస్తుంది.

* ఇక కొంద‌రికి ఎండ‌లో వెళ్లినా త‌ల‌నొప్పి వ‌స్తుంది. కాబ‌ట్టి ఎండ‌లో తిరిగేవారు క‌చ్చితంగా నెత్తిపై స్కార్ఫ్ లేదా టోపీని వాడాలి. ఎండ నేరుగా త‌ల‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అస‌లు త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌వు.

* త‌ల నొప్పి వ‌చ్చిన వెంట‌నే టీ జోలికి వెళ్ల‌డం తాగ్గించాలి. వాటి స్థానంలో కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ వంటి డ్రింక్స్ తీసుకోవాలి. ఇవి కూడా త‌ల‌నొప్పిని దూరం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి.

* కొన్ని సంద‌ర్భాల్లో తీసుకునే ఆహారం వేళ‌ల్లో మార్పులు జ‌రిగినా త‌ల‌నొప్పిగా ఉంటుంది. కాబ‌ట్టి భోజ‌నానికి భోజ‌నానికి మ‌ధ్య ఎక్కువ గ్యాప్ ఉండ‌కుండా చూసుకోవాలి.

* త‌ల బ‌ద్ద‌ల‌య్యేలా నొప్పి అనిపిస్తే వెంట‌నే అర‌టి పండు, పైనాపిల్‌, పుచ్చ‌కాయ వంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. వీటివ‌ల్ల వెంట‌నే నొప్పి త‌గ్గుతుంది.

Also Read: World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ ‘గుడ్డు’ స్పెషల్..

Coronavirus: ఒమిక్రాన్‌ బారిన పడిన స్టార్‌ హీరో మాజీ భార్య.. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనదంటూ..

PM Narendra Modi: దేశంలో మరో లాక్‌డౌన్..? 13న సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..