రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర ఫోన్ పెట్టుకునే అలవాటుందా.? మానకపోతే తండ్రులు కాలేరట.!

|

Jul 20, 2024 | 7:34 PM

రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర ఫోన్ పెట్టుకునే అలవాటు మీకుందా.? వెంటనే ఈ అలవాటు మానుకోండి.. లేదంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పలువురిలో సంతానలేమి సమస్య పెరగడానికి..

రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర ఫోన్ పెట్టుకునే అలవాటుందా.? మానకపోతే తండ్రులు కాలేరట.!
Sleeping With Mobile
Follow us on

రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర ఫోన్ పెట్టుకునే అలవాటు మీకుందా.? వెంటనే ఈ అలవాటు మానుకోండి.. లేదంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని పలు పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పలువురిలో సంతానలేమి సమస్య పెరగడానికి అసలు కారణం ఇదేనని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో చాలామంది రాత్రిపూట ఎక్కువసేపు మొబైల్ చూస్తూ నిద్రలోకి జారుకుంటారు. అలాగే ఇంకొందరు తమ తల దగ్గరే ఫోన్ పెట్టుకుని పడుకుంటారు. ఇది మీ లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, ఈ అలవాటున్న పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గించగలవని చెబుతున్నారు. మొబైల్ రేడియేషన్ కారణంగా పురుషులలో లైంగిక సమస్యలు వచ్చే అవకాశముందన్నారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

అలాగే గర్బిణీలు పక్కనే మొబైల్ పెట్టుకుని నిద్రపోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. ఒత్తిడి, ఆందోళన.. అదనంగా నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. అటు పిల్లల ఆరోగ్యంపై కూడా ఈ అలవాటు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుందట. పక్కనే మొబైల్ ఫోన్ పెట్టుకుని పడుకోవడం వల్ల కూడా తలకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి నిద్రించే సమయంలో మొబైల్ దూరంగా ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే)

ఇది చదవండి: అప్పుడేమో రౌడీ బేబీ.. ఇప్పుడేమో వయ్యారాల నాటీ.. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి