Dengue Drug: వైద్యరంగంలో మరో ముందడుగు.. డెంగ్యూకి డ్రగ్‌.. అభివృద్ధి చేసిన సీడీఆర్‌ఐ.. వివరాలు..

|

Oct 20, 2021 | 8:15 PM

Anti Viral Dengue Drug: భారతదేశంలో డెంగ్యూ జ్వరానికి ఇంతవరకు ఔషధం లేని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఔషధరంగంలో మరో ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని

Dengue Drug: వైద్యరంగంలో మరో ముందడుగు.. డెంగ్యూకి డ్రగ్‌.. అభివృద్ధి చేసిన సీడీఆర్‌ఐ.. వివరాలు..
Dengue
Follow us on

Anti Viral Dengue Drug: భారతదేశంలో డెంగ్యూ జ్వరానికి ఇంతవరకు ఔషధం లేని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఔషధరంగంలో మరో ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CDRI) శాస్త్రవేత్తలు డెంగ్యూ చికిత్సకు ఓ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. వాస్తవానికి డెంగ్యూ జ్వరానికి ఇంతవరకు ప్రత్యేకమైన ఔషధాలంటూ ఏవీ లేవు. దీని చికిత్స కోసం ఫ్లూయిడ్స్‌ను అధికంగా శరీరంలోకి పంపించి.. బ్లడ్‌ ప్లేట్ లెట్లను పడిపోకుండా చూస్తారు. ఇలా డెంగ్యూ బారిన పడిన వారికి చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఔషధాన్ని కనిపెట్టినట్టు చెప్పారు లక్నోకు చెందిన సీడీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో డెంగూ ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఔషధాన్ని మనుషులపై ప్రయోగించేందుకు (హ్యుమన్ ట్రయల్స్) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా లభించినట్లు పేర్కొంటున్నారు. త్వరలో ఈ ఔషధాన్ని దేశంలోని 20 నగరాల్లోని కొంతమంది ప్రజలపై ప్రయోగించనున్నారు. ముంబైకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ డ్రగ్‌ హ్యుమన్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. కాగా.. ఈ డ్రగ్‌ డెంగ్యూను నిర్మూలించగలిగితే వైద్య శాస్త్రంలో భారత్‌ మరో ముందడుగు వేసినట్లనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

డెంగ్యూ డ్రగ్‌ వివరాలు..
ఈ ఔషధాన్ని మొక్కల ఆధారంగా తయారుచేశారు. దీనికి AQCH అని పేరు పెట్టారు. ఇది సహజంగానే యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. దీనిని మొదటగా ఎలుకలపై కూడా పరీక్షించి విజయవంతమైన ఫలితాలను అందుకున్నట్లు పేర్కొంటున్నారు.
అయితే ఈ డ్రగ్‌ను దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. కాన్పూర్, లక్నో, ఆగ్రా, ముంబై, థానే, పుణె, ఔరంగాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, మంగళూరు, బెల్గాం, చెన్నై, జైపూర్, చండీగఢ్, విశాఖపట్నం, కటక్, ఖుర్దా, నాధ్‌ద్వారా తదితర నగరాల్లో హ్యుమన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (GSVM) మెడికల్ కాలేజీ, లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU), ఆగ్రాలోని సరోజినీ నాయుడు (SN) మెడికల్ కళాశాలలో మొదటగా హ్యుమన్ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రంలో వందమంది రోగులపై ఈ ఔషధాన్ని ప్రయోగించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
హ్యుమన్ ట్రయల్స్ లో భాగంగా 18 ఏళ్ల వయసు నిండిన వారిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వ్యక్తికి రెండు రోజుల ముందే డెంగూ ఫీవర్ ఉన్నట్టు నిర్ధారిస్తేనే ట్రయల్స్‌కు అనుమతిస్తారు.
ట్రయల్స్‌లో భాగంగా రోగిని ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తారు. ఈ క్రమంలో ఏడు రోజులపాటు డ్రగ్‌ను ఇస్తారు. ఆ తరువాత 17 రోజుల పాటు అతడిని పరిశీలనలో ఉంచనున్నారు.

Also Read:

హెచ్చరిక..! వ్యాక్సిన్‌ తీసుకోనివారు ఈ విషయం తెలుసుకోండి..? లేదంటే చాలా ప్రమాదం..

Pig Kidney Transplant: న్యూయార్క్ వైద్యుల అరుదైన ఘనత.. పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి..