అల్లం మాదిరి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పెరుగుతుందా..? మీరు ఈ తప్పు చేస్తున్నట్లే..

|

Jun 24, 2024 | 10:06 AM

ఉరుకులు, పరుగులు జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ముఖ్యంగా ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.. ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. శరీర ఆకృతి ఆకస్మికంగా క్షీణించడం లేదా పెరగడం అనేది మీ జీవనశైలికి సంబంధించిన తప్పుల ఫలితం..

అల్లం మాదిరి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పెరుగుతుందా..? మీరు ఈ తప్పు చేస్తున్నట్లే..
Weight Gain
Follow us on

ఉరుకులు, పరుగులు జీవితం.. పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ముఖ్యంగా ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.. ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. శరీర ఆకృతి ఆకస్మికంగా క్షీణించడం లేదా పెరగడం అనేది మీ జీవనశైలికి సంబంధించిన తప్పుల ఫలితం.. అటువంటి పరిస్థితిలో బరువు పెరిగే క్రమంలో తగ్గడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాము.. కానీ ఆశించిన ఫలితాలను పొందలేము. మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వల్ల బరువు అమాంతం పెరగుతుంది.. ఎక్కడపడితే అక్కడ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మన తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు..

వ్యాధులు, జీవనశైలి అలవాట్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ ఈ 5 తప్పులను పునరావృతం చేస్తుంటే, త్వరలో మీ శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.. అవేంటో తెలుసుకోండి..

అతిగా తినడం.. అది ఆరోగ్యకరమైన విషయమే అయినా..

ఆరోగ్యకరమైన వాటిని తినడం వల్ల బరువు పెరగదనేది సాధారణ అపోహ. వాస్తవానికి, జంక్ ఫుడ్ కంటే ఆరోగ్యకరమైన ఆహారం మంచిది.. కానీ అధిక కేలరీల కంటెంట్ ఉన్న ఆహారం ఏదైనా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల, సమతుల్య పరిమాణంలో మాత్రమే తినాలి.

ఆహారంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోదు..

బరువు తగ్గాలంటే కేవలం ఆహారంపై దృష్టి పెడితే సరిపోదు. వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల కేలరీలు ఖర్చవడమే కాకుండా కండరాలు బలపడతాయి.. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది .

చాలా సేపు భోజనం మానేయడం..

క్యాలరీలను తగ్గించుకోవడానికి చాలా మంది ఆకలిగా ఉన్నా తినడం మానేస్తారు. ఈ పద్ధతి వల్ల భవిష్యత్తులో ఎదురుదెబ్బ తగలవచ్చు. చాలాసేపు నియంత్రణలో ఉన్న ఆకలిని తీర్చడానికి, ఎక్కువ తింటారు.. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందువల్ల, రోజంతా ఆరోగ్యకరమైన వాటిని కొంచెం కొంచెంగా తినడం మంచిది.

పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం..

చాలా సార్లు ప్రజలు బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం తీసుకోరు. కేలరీలను తక్కువగా ఉంచడంపై దృష్టి పెడతారు.. కానీ శరీరం సరిగ్గా పనిచేయడానికి వివిధ పోషకాలు అవసరం. అటువంటి పరిస్థితిలో, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల కొరత కారణంగా జీవక్రియ మందగిస్తుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.. ఫలితంగా బరువు తగ్గడం కష్టం అవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..