Ragi: రాగి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ పరార్

|

Feb 11, 2024 | 3:04 PM

తృణధాన్యాలలో ఒకటైన రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు మాములుగా ఉండవు. రాగులతో ఎన్నో రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. రాగి ముద్ద, రాగి దోసె, రాగి రోటీ, రాగి అంబలి మొదలైనవి ఆరోగ్యానికి మేలు చేసే వంటకాలను ఈ రాగుల నుండి తయారుచేస్తారు. రాగులను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Ragi: రాగి ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ పరార్
Ragi Dosa
Follow us on

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది.. మిల్లెట్ ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిల్లెట్స్ అంటే.. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు ఇలాంటివి అనమాట. రోగ నిరోదక శక్తి పెంచుకునేందుకు ఇప్పుడు చాలామంది మిల్లెట్ గంజి తాగుతున్నారు. వీటిలో రాగులకు ఎక్కడు ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ప్రొటీన్లు , కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

  • రాగి అంబలిని రోజూ తాగడం వల్ల పోషకాలతో శరీరం చల్లగా ఉంటుంది.
  • తల్లిపాలు తక్కువగా ఉన్నవారు బెల్లం, బెల్లం రాగుల్లో కలిపి తింటే మంచిది.
  • రాగి పిండిని.. ఉప్పులో కలిపి పళ్లు తోముకోవడం వల్ల.. చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడి దంతాలు దృఢంగా ఉంటాయి.
  • మరిగించిన నీళ్లలో రాగి పొడి, యాలకులు వేసి కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పిత్తం తగ్గుతుంది.
  • రాగి ఆహారంలో భాగం అయితే  స్థూలకాయం, మధుమేహ రోగులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • రాగుల పిండితో పప్పు కలిపి దోసె లేదా ఇడ్లీ తయారు చేసి తింటే శరీరం చల్లబడుతుంది.
  • రాగి పిండి ముద్దను పచ్చి రసంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య తీరుతుంది.
  • రాగులను నానబెట్టి.. ఆపై బాగా గ్రైండ్ చేసి అందులో పాలు, నెయ్యి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకుల పొడి, పంచదార కలిపి తీసుకుంటే శరీరానికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా అందుతుంది.
  • రాగులను ఆహారంలో చేర్చుకుంటే ఒత్తిడి నుంచి స్వాంతన లభిస్తుంది
  • రాగులు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  • రాగులు రెగ్యులర్‌గా తీసుకుంటే పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి