కలబంద చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గిచడంలోనూ సహయపడుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబందను తీసుకోవడం వలన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే కలబందను అన్ని సమయాల్లోనూ తీసుకోవడం చాలా ప్రమాదం.. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారున్నారు. శ్రుతిమించి తీసుకోవడం వలన మంచి కూడా చెడు జరుగుతుంది. కలబందను అధికంగా తీసుకోవడం వలన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
గ్యాస్ సమస్య, మలబద్ధకం ఉన్నవారు కలబంద తినకూడదు. గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు సమస్యను తీసుకోవడం మరింత పెంచుతుంది. అలాగే గర్భధారణ సమయంలో ఉన్నవారు కలబందను తీసుకోవద్దు. దీని వలన గర్భాశయంలో మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది. దీంతో అబార్షన్, పుట్టుకతో లోపాలు వచ్చే సమస్యలు ఉన్నాయి…
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కలబందను తీసుకోవడం మానుకోవాలి. దీనివలన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది సరిగ్గా లేని గుండె స్పందన సమస్యలను కలిగిస్తుంది. అలాగే నాడీ సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ఉన్నవారు కలబందను అస్సలు తీసుకోవద్దు. దీనివలన కిడ్నీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కలబందను తీసుకోవడం వలన రక్తపోటు సమస్య కలుగుతుంది. అందువలన తక్కువ రక్తపోటు ఉన్నవారు కలబందను తీసుకోవద్దు.
Niharika Konidela: మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న మెగా డాటర్.. అసలు ‘ఓసీఎఫ్‌ఎస్’ ఏంటో తెలియాలంటే..
మరో భారీ మల్టీస్టారర్‌కు తెరతీస్తోన్న శ్రీకాంత్ అడ్డాలా.. ఈసారి మెగా హీరోలను కలిపేందుకు ప్రయత్నం.?