Green Tea Effects: ఆరోగ్యమని గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారా? ఈ సమయంలో అస్సలు తాగొద్దు..

|

Sep 12, 2022 | 6:11 AM

Green Tea Effects: బరువు తగ్గాలన్నా, చర్మ సౌందర్యం పెరగాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా గ్రీన్ టీ ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలంటే..

Green Tea Effects: ఆరోగ్యమని గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారా? ఈ సమయంలో అస్సలు తాగొద్దు..
Green Tea Benefits
Follow us on

Green Tea Effects: బరువు తగ్గాలన్నా, చర్మ సౌందర్యం పెరగాలన్నా, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా గ్రీన్ టీ ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలంటే గ్రీన్ టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అందుకే చాలా మంది టీ కి బదులుగా గ్రీన్ టీ తాగేస్తుంటారు. మరి గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం ఏంటో తెలుసా? గ్రీన్ టీని తప్పు సమయంలో తీసుకుంటే అది శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుందని తెలుసా? అవును, గ్రీన్ టీ తీసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. గ్రీన్ టీ ప్రయోజనాలు పొందాలంటే ఆ సమయంలోనే తాగాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?

భోజనానికి 1 గంట ముందు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరానికి ఉపయోగం ఉంటుంది. అసలైన గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. కావున తిన్న వెంటనే దానిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి మరింత గ్గుతుంది. దీని వల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, ఖాళీ కడుపుతో గ్రీన్ టీని ఎప్పుడూ తాగొద్దు. గ్రీన్ టీ తో పాటు ఏదైనా తినాలి. అదే సమయంలో, మొత్తం రోజులో మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తీసుకోవద్దు.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు..

బరువు తగ్గడం: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అసలైన గ్రీన్ టీ జీవక్రియను బలపరుస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. గ్రీన్ టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. అదే సమయంలో, ఇది కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది: క్యాన్సర్ రోగులకు గ్రీన్ టీ మంచి ఆరోగ్య ప్రదాయిని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది సిరల్లో ఏర్పడే అడ్డంకులను తగ్గిస్తుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..