Diabetes: డయాబెటిక్స్ గుర్తించుకోవాల్సిన లక్కీ నెంబర్ ఇదే ..!

|

Jul 10, 2024 | 4:22 PM

షుగర్ వ్యాధిగ్రస్థులు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరిశీలిస్తుండాలి. బ్లడ్ షుగ్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ వరకూ పరిస్థితి దారితీయవచ్చు. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.. లేదంటే ఆర్గాన్స్ దెబ్బతింటాయి....

Diabetes: డయాబెటిక్స్ గుర్తించుకోవాల్సిన లక్కీ నెంబర్ ఇదే ..!
Diabetes
Follow us on

డయాబెటిక్స్ గుర్తించుకోవాల్సిన ఒక కీలక అంశం ఏమిటంటే వారి లక్కీ నెంబర్ 7 అని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ పీఎస్ వలీ చెబుతున్నారు. వారి లక్కీ నెంబర్ ఎందుకు సెవెన్ అని ఎందుకంటామో ఇప్పుడు తెలుసుకుందాం. HB A1C అన్న ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా షుగర్ పేషెంట్స్‌లో గడిచిన మూడు నెలల్లో షుగర్ ఎంత వరకు కంట్రోల్ లో ఉంటుందో తెలుసుకోవచ్చు.  HB A1C లెవెల్ 5.7 కన్నా తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు గుర్తిస్తారు. HB A1C లెవెల్ 5.8 నుంచి 6.4 కన్నా తక్కువ ఉంటే ప్రీ డయాబెటిస్ క్యాటగిరిలో ఉన్నట్లు గ్రహించాలి. ఆల్రెడీ షుగర్ ఉన్న వారిలో HB A1C లెవెల్ 6.5 కన్నా తక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ చాలా బాగా ఉన్నట్లు గుర్తిస్తారు.

కానీ గుర్తించు కోవాల్సిన అంశం ఏంటంటే, షుగర్ పేషెంట్స్ వారి HB A1C లెవెల్‌ని సంవత్సరం పొడుగునా 7 కన్నా తక్కువలో ఉంచుకోగలిగితే.. షుగర్ వల్ల లాంగ్ టర్మ్‌లో వారి శరీర భాగాలు డామేజ్ కాకుండా చూసుకోవచ్చు. అంటే మీరు డయాబెటిక్ అయినప్పటికీ, మీరు మీ HB A1C లెవెల్‌ని ఏడాది పొడుగునా 7 కన్నా తక్కువ మెయింటైన్ చేసుకోగలిగితే, షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు, గుండె, బ్రెయిన్ సమస్యలు, రెటీనా సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అందుకే, షుగర్ పేషెంట్స్‌లో లక్కీ నెంబర్ 7 అని చెప్తారు. ఈ నంబర్‌ని మెయింటైన్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అందుకే షుగర్ పేషెంట్స్ అందరు కూడా వారి HB A1C ని సెవెన్ లోపు ఉంచుకోవడమే ధ్యేయంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..