Diabetes: షుగర్ ఉన్నవారికి ఈ నాలుగు సంకేతాలు చాలా డేంజర్.. అశ్రద్ధ చేయొద్దు

|

Jul 11, 2024 | 5:42 PM

డయాబెటిస్ అనేది బతికున్నంత కాలం వేధించే జబ్బు. మన బాడీ రక్తంలోని చక్కెరను ప్రాసెస్ చేయలేనప్పుడు.. షుగర్ వస్తుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలు, గుండె, కళ్లు వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే డయాబెటిస్ ఇచ్చే హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.

Diabetes: షుగర్ ఉన్నవారికి ఈ నాలుగు సంకేతాలు చాలా డేంజర్.. అశ్రద్ధ చేయొద్దు
Diabetes
Follow us on

షుగర్ ఉన్నవారు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. వైద్యులు సూచించిన డైట్ ఫాలో అవ్వాలి. జీవనశైలి సైతం మార్చుకోవాలి. షుగర్ లెవల్స్ పెరిగితే.. మీ శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే డయబెటిస్ ఉన్నవారు  ఈ నాలుగు సింటమ్స్ కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి అంటున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్.. పీఎస్ వలీ. అవెంటో తెలుసుకుందాం పదండి…

  • బీపీ అస్సలు కంట్రోల్ లో ఉండకపోవడం: అస్సలు కంట్రోల్‌లో లేని హై బీపీ కిడ్నీ పనితీరులో లోపాలకు ఒక సంకేతం కావచ్చు. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు… కెమికల్స్ శరీరంలో అధిక మోతాదులో రిలీజ్ కావడం వల్ల బీపీ అదుపులో ఉండకపోవచ్చు.
  •  కాళ్ళ వాపులు కనిపించడం: కాళ్ళ వాపులు ఉన్న వారందరికీ కిడ్నీ సమస్యలు ఉన్నట్లు కాదు. కానీ, కాళ్ళ వాపులు కనిపిస్తే మాత్రం కిడ్నీ పరీక్షలు విధిగా చేయించాలి.
  • యూరిన్‌లో ఎప్పుడూ లేనట్లుగా నురగ ఎక్కువగా కనిపిస్తున్నా: యూరిన్ పాస్ చేశాక… ఫ్లష్ చేసినా క్లియర్ కాని నురగ కనిపిస్తుంటే.., కిడ్నీ ఫంక్షన్స్ గురించి అల్బుమిన్ ప్రోటీన్ లీకేజీ గురించి టెస్ట్స్ చేయించాలి.
  • షుగర్ పేషెంట్స్ లో రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు: విధిగా కిడ్నీ పరీక్షలు చేయించాలి. రెటీనా రక్తనాళాలు, కిడ్నీల రక్తనాళాల స్ట్రక్చరల్ ఫిలాసఫీ ఒకే రకంగా ఉంటుంది. సో రెటీనా ప్రోబ్లెమ్స్ ఉన్న షుగర్ పేషెంట్స్ కచ్చితంగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.

 

కాగా షుగర్ ఉన్నవారు ఎప్పటికప్పుడు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్ అల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, సీరం క్రియాటినిన్ టెస్ట్‌లు చేయించుకోవడం చాలా ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..