Cancer Treatment: క్యాన్సర్ ఖేల్ ఖతం! కొత్త సంవత్సరంలో కిర్రాక్ న్యూస్.. మానవజాతి ఊపిరి పీల్చుకోవచ్చు..

| Edited By: Anil kumar poka

Jan 01, 2023 | 11:43 AM

జపాన్ లోని టోక్యో కు చెందిన శాస్త్రవేత్తల బృందం.. మరికొన్ని కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందే యావత్ ప్రపంచానికి ఓ శుభవార్తను అందించింది. క్యాన్సర్ కారక కణాలను అంతమొందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే కృత్రిమ డీఎన్ఏను తాము కనుగొన్నట్లు ప్రకటించింది.

Cancer Treatment: క్యాన్సర్ ఖేల్ ఖతం! కొత్త సంవత్సరంలో కిర్రాక్ న్యూస్.. మానవజాతి ఊపిరి పీల్చుకోవచ్చు..
Cancer
Follow us on

క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. మానవ శరీరంలో ప్రవేశించి గుల్లచేసి చివరికి ప్రాణం తీసేంత వరకూ శాంతించదు. దీనిని అదుపు చేయడానికి మందులు, అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నా.. శాశ్వత పరిష్కారం మాత్రం ఇప్పటి వరకూ దొరకలేదు. అయితే జపాన్ లోని టోక్యో కు చెందిన శాస్త్రవేత్తల బృందం.. మరికొన్ని కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందే యావత్ ప్రపంచానికి ఓ శుభవార్తను అందించింది. క్యాన్సర్ కారక కణాలను అంతమొందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే కృత్రిమ డీఎన్ఏను తాము కనుగొన్నట్లు ప్రకటించింది. ఇది సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మెలనోమా క్యాన్సర్ కారక కణాలను నాశనం చేసినట్లు పేర్కొంది. ఇది 2022 సంవత్సరం మనకు ఇచ్చిన బహుతిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023వ సంవత్సరంలో క్యాన్సర్ రోగులు మరిన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని వినిపిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్యాన్సర్ మహా జిత్తులమారి..

సాధారణంగా మానవ శరీరంలోకి ఏదైనా ఒక కొత్త కణం వస్తే వెంటనే శరీంలోని వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలు యాక్టివేట్ అయ్యి వాటిపై దాడి చేసి చంపేస్తాయి. అయితే క్యాన్సర్ కణాలు మాత్రం చాలా జిత్తుల మారి. అవి శరీరంలో దాగుకొని ఉంటాయి. అందుకే క్యాన్సర్ కణాలు, కణితులపై మానవ వ్యాధి నిరోధక వ్యవస్థ పనిచేయదు.

పరిశోధకులు ఏం చేశారంటే..

జపాన్ కు చెందిన ఆంకాలజిస్ట్ ల బృందం క్యాన్సర్ కణాలను సహజంగా చంపేందుకు గానూ కృత్రిమ డీఎన్ఏను సృష్టించారు. హైర్ పిన్ ఆకారంలో ఒక జత డీఎన్ఏ అణువులను, ఓహెచ్పీలను సృష్టించి వాటిని క్యాన్సర్ కణాలపై ప్రయోగించారు. దీంతో క్యాన్సర్ కణాలు పూర్తి నశించాయి. అంతేకాక శరీరంలోని ఇతర ఏ భాగాలలోను క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందకుండా చేశాయి. ఇది సంప్రదాయ వైద్య విధానాలు భిన్నమైనదే అయినా, క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ చికిత్స అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

సహజంగా ప్రమాదకరమైనవి..

పరిశోధకులు కొత్త తరహా చేసిన ప్రయోగం పేరు న్యూక్లియిక్ యాసిడ్ ట్రీట్మెంట్. క్యాన్సర్‌కు సంబంధించి చేసే ఈ న్యూక్లియిక్-యాసిడ్ ట్రీట్‌మెంట్‌లు సహజంగానే ప్రమాదకరమైనవి. ఎందుకంటే కృత్రిమంగా శరీరంలోకి పంపించే కణాలు క్యాన్సర్‌కు సంబంధించిన కణాలపై దాడి చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థ కు సంబంధించిన ఆరోగ్యకరమైన కణాలపై కూడా దాడి చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అలా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని దీనిని నిర్వహించాల్సి ఉంది.

ఇది శుభవార్త..

ఈ సందర్భంగా ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, యూనివర్సిటీ ప్రొఫెసర్ అకిమిట్సు ఒకామోటో మాట్లాడుతూ తమ పరిశోధన డ్రగ్ డిస్కవరీ పరిశోధకులకు, క్యాన్సర్ రోగులకు కూడా మంచి శుభవార్తగా అభివర్ణించారు. ఇది క్యాన్సర్ కు డ్రగ్ డెవలమ్మెంట్ తో పాటు కొత్త చికిత్సా విధానాలను ప్రయత్నించేందుకు దోహదం చేస్తుందన్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..