Black Pepper: నల్ల మిరియాలతో అద్భుత ప్రయోజనాలెన్నో.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

|

Sep 26, 2022 | 1:00 PM

మన వంటింట్లో దొరికే ఈ ఆహార పదార్ధంతో డబుల్ బెనిఫిట్స్ పొందొచ్చునని డాక్టర్స్ చెబుతున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చుట..

Black Pepper: నల్ల మిరియాలతో అద్భుత ప్రయోజనాలెన్నో.. ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!
Black Pepper Benefits
Follow us on

నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మన వంటింట్లో దొరికే ఈ ఆహార పదార్ధంతో డబుల్ బెనిఫిట్స్ పొందొచ్చునని డాక్టర్స్ చెబుతున్నారు. నల్ల మిరియాలతో మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు పొందొచ్చు. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సినంత స్టామినా పెంచుతుంది. కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలతో బాధపడేవారు.. నిమ్మరసంలో చిటికెడు మిరియాల పొడి, బ్లాక్ స్లాట్ కలిపి తాగితే.. ఉపశమనం లభిస్తుంది. అలాగే నల్ల మిరియాల పొడి తీసుకున్నట్లయితే.. మీలో ఒత్తిడి, నిరాశ తొలిగిపోతాయి. నల్ల మిరియాల్లో పైపెరిన్ అనే కెమికల్ ఉంది. అది మీలో ఉన్న ఈ లక్షణాలను తగ్గేలా చేస్తుంది.

ఇదిలా ఉంటే.. జలుబు, దగ్గు, కఫంతో బాధపడేవారు.. నల్లమిరియాల పొడి వేసిన చారు తిన్నట్లయితే.. కాస్త రిలీఫ్ పొందొచ్చు. అటు ఎండుమిర్చి, జాజికాయ, రాళ్ల ఉప్పు, నల్ల మిరియాలు కలిపి మిశ్రమాన్ని తయారు చేసి.. అందులో కొన్ని చుక్కల ఆవాల నూనె కలిపి మీ దంతాలకు, చిగుళ్ళకు పట్టించి.. ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకుంటే.. చిగుళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. నల్ల మిరియాల్లో విటమిన్ సి, ఏ, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్లతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి.

నల్ల మిరియాలు రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. దీంతో గుండెపోటు దరికి చేరదు. వేగంగా బరువు తగ్గాలన్నా, లేదా ఊబకాయంతో బాధపడుతున్నా.. మీ ఆహారంలో నల్ల మిరియాలు చేర్చుకోండి చాలు.. మార్పు అదే వస్తుంది. అటు నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)