రైతులకు కేంద్రం శుభవార్త.. ఏప్రిల్‌ మొదటి వారంలో పీఎం-కిసాన్‌ నిధులు విడుదల!

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని

రైతులకు కేంద్రం శుభవార్త.. ఏప్రిల్‌ మొదటి వారంలో పీఎం-కిసాన్‌ నిధులు విడుదల!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 26, 2020 | 8:58 PM

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. కొన్ని చోట్ల వైరస్‌ సోకిన వారికి సరైన వైద్యసేవలు అందించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పీఎం-కిసాన్‌ తొలి విడత నిధులను ఏప్రిల్‌ మొదటి వారంలోనే విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడత కింద రూ.2వేలు చొప్పున 8.69 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది.

కాగా.. భారత్ లోనూ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ప్యాకేజీ ప్రకటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం వెల్లడించారు. పీఎం-కిసాన్‌ పథకం కింద ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతను ఏప్రిల్‌ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు.