ఉద్ధవ్ కు శుభాకాంక్షలు తెలిపిన సోనియా, రాహుల్!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు ఓ లేఖ రాశారు.  అసాధారణ పరిస్థితులలో.. బీజేపీ బెదిరింపులకు లొంగకుండా శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాని రాహుల్ గాంధీ ప్రత్యేక లేఖలో బిజెపికి వ్యతిరేకంగా ఈ కూటమి కలిసి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రభుత్వం […]

ఉద్ధవ్ కు శుభాకాంక్షలు తెలిపిన సోనియా, రాహుల్!
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2019 | 11:04 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సేన చీఫ్ ఉద్ధవ్ థాకరేకు ఓ లేఖ రాశారు.  అసాధారణ పరిస్థితులలో.. బీజేపీ బెదిరింపులకు లొంగకుండా శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాని రాహుల్ గాంధీ ప్రత్యేక లేఖలో బిజెపికి వ్యతిరేకంగా ఈ కూటమి కలిసి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రభుత్వం పేదలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

రాజకీయ వాతావరణం విషపూరితంగా మారి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. రైతులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి ఒక అసాధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని, ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మూడు పార్టీలు తమ వంతు కృషి చేస్తాయన్న నమ్మకం ఉందని” ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఈ కూటమి బాధ్యతాయుతమైన, పారదర్శక పరిపాలనను అందిస్తుందని, మా సమిష్టి కృషి నిస్సందేహంగా ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన చీఫ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాలేనని సోనియా గాంధీ తెలిపారు. “మీరు మీ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు, వ్యక్తిగతంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ఆమె లేఖలో పేర్కొన్నారు.