ఈ మధ్యాహ్నం 3 గంటల్లోపే నామినేషన్ల దాఖలుకు గడువు.. ఊపిరి పీల్చుకోలేని సమయంలోనూ హడావుడిగా నామినేషన్లు

నామినేషన్లకు ఇవాళ ఆఖరు తేది! మధ్యాహ్నం 3 గంటల్లోపు రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులెవరో తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అన్ని రాజకీయ పార్టీ ఆఫీసుల్లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. ఇటు వరద సాయంపై టీఆర్‌ఎస్‌ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకు పోతోంది. ఇవాళ మధ్నాహ్నం 3గంటలకే గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుండటంతో టీఆర్‌ఎస్‌ తప్ప అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయ్‌. ఆయా రాజకీయ పార్టీ […]

  • Venkata Narayana
  • Publish Date - 7:39 am, Fri, 20 November 20

నామినేషన్లకు ఇవాళ ఆఖరు తేది! మధ్యాహ్నం 3 గంటల్లోపు రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులెవరో తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అన్ని రాజకీయ పార్టీ ఆఫీసుల్లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. ఇటు వరద సాయంపై టీఆర్‌ఎస్‌ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకు పోతోంది. ఇవాళ మధ్నాహ్నం 3గంటలకే గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుండటంతో టీఆర్‌ఎస్‌ తప్ప అభ్యర్థుల ఎంపికలో మిగతా పార్టీలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయ్‌. ఆయా రాజకీయ పార్టీ ఆఫీసుల్లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. ఇటు టిక్కెట్లు దక్కని రెబల్స్‌ బెడదతో పార్టీలు సతమతమవుతున్నాయ్‌. ఊపిరి పీల్చుకోలేని సమయంలోనూ గురువారం హడావుడి మధ్య నామినేషన్లు వేశారు. మొత్తం 522 మంది అభ్యర్థులు 580 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.వీరిలో TRS నుంచి 195, బీజేపీ 140, కాంగ్రెస్‌ 68, TDP 47, MIM నుంచి 27 మంది ఉన్నారు. ఇక, 110 మంది స్వతంత్రులు నామినేషన్ వేశారు.