FEATURED:

ఏఐతో నడిచే LG వాషింగ్ మెషీన్ వచ్చేసింది.. 20 వేల వాష్‌ ప్యాటర్న్స్‌

ఎల్జీ కొత్త AI DD 2.0 వాషింగ్‌ మెషీన్‌ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. 20 వేల వాష్‌ ప్యాటర్న్స్‌ ఆధారంగా బట్టల రకం, బరువు, మురికిని గుర్తించి వాషింగ్‌ సైకిల్‌ను ఎంపిక చేస్తుంది. AI Wash, 6 Motion, ezDispense, Steam+, LG ThinQ వంటి ఫీచర్లు ఉన్నాయి. 12 నుంచి 20 కిలోల సామర్థ్యంతో ధర రూ.72,990 నుంచి ప్రారంభమవుతుంది.

ఏఐతో నడిచే LG వాషింగ్ మెషీన్ వచ్చేసింది.. 20 వేల వాష్‌ ప్యాటర్న్స్‌
Lg Ai Washing Machine

Updated on: Aug 24, 2026 | 1:01 PM

బట్టలు ఉతికేటప్పుడు ఏ వాష్‌ ప్రోగ్రామ్‌ ఎంచుకోవాలి? ఎంత డిటర్జెంట్‌ వేయాలి? సున్నితమైన బట్టలకు ఏ సెట్టింగ్‌ ఉపయోగించాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ సమస్యలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో పరిష్కారం చూపేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ కొత్త AI DD 2.0 టెక్నాలజీతో వాషింగ్‌ మెషీన్లను తీసుకొచ్చింది.

20 వేల వాష్‌ ప్యాటర్న్స్‌

AI DD 2.0 టెక్నాలజీ దుస్తుల బరువు, ఫ్యాబ్రిక్‌ రకం, మురికి స్థాయి, అవసరమైన డిటర్జెంట్‌ వంటి అంశాలను గుర్తిస్తుంది. దాదాపు 20,000 వాష్‌ ప్యాటర్న్స్‌ ఆధారంగా తగిన వాషింగ్‌ సైకిల్‌ను ఎంపిక చేస్తుంది. దీంతో వినియోగదారులు ప్రతిసారీ స్వయంగా వాష్‌ ప్రోగ్రామ్‌ ఎంచుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఎల్జీ ఇండియా హోమ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ యంగ్‌ మిన్‌ హ్వాంగ్‌ మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల లాండ్రీ అలవాట్లపై లభించిన విస్తృత వినియోగ డేటా ఆధారంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

AI Washతో ఆటోమేటిక్‌ సెట్టింగ్స్‌

AI Wash ఆప్షన్‌లో బట్టలను మెషీన్‌లో వేసి స్టార్ట్‌ చేస్తే చాలు. మెషీన్‌ లోడ్‌ను విశ్లేషించి తగిన వాషింగ్‌ యాక్షన్‌ను ఎంపిక చేస్తుంది. దీనికి ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ సహాయపడుతుంది. సాధారణ బెల్ట్‌, పుల్లీ వ్యవస్థకు బదులుగా మోటార్‌ నేరుగా డ్రమ్‌కు అనుసంధానమై ఉండటంతో డ్రమ్‌ కదలికలను మరింత కచ్చితంగా నియంత్రించవచ్చని కంపెనీ చెబుతోంది.

6 మోషన్ టెక్నాలజీతో ఫ్యాబ్రిక్‌ కేర్‌

మెషీన్‌లో 6 మోషన్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఉంది. టంబ్లింగ్‌, రోలింగ్‌, స్టెప్పింగ్‌, స్క్రబ్బింగ్‌, స్వింగింగ్‌, ఫిల్ట్రేషన్‌ వంటి ఆరు రకాల డ్రమ్‌ కదలికలను ఇది ఉపయోగిస్తుంది. బట్టల రకాన్ని బట్టి ఈ కదలికలను మార్చడం ద్వారా సున్నితమైన దుస్తులకు తగిన సంరక్షణతో పాటు, ఎక్కువగా మురికిగా ఉన్న బట్టలకు సమర్థవంతమైన క్లీనింగ్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

డిటర్జెంట్‌ నుంచి మొబైల్‌ కంట్రోల్‌ వరకు

ezDispense ఫీచర్‌ లోడ్‌ను బట్టి అవసరమైన డిటర్జెంట్‌ను ఆటోమేటిక్‌గా పంపిణీ చేస్తుంది. ఒక్కసారి రీఫిల్‌ చేస్తే లోడ్‌ను బట్టి 30 వాష్‌ సైకిళ్ల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే టర్బో వాష్ 360° మల్టీ-డైరెక్షనల్‌ వాటర్‌ జెట్లతో వేగవంతమైన క్లీనింగ్‌ను అందిస్తుంది. కొన్ని సైకిళ్లలో 39 నిమిషాల్లో వాష్‌ పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది. స్టీమ్+ టెక్నాలజీ అలర్జెన్లు, హానికరమైన బ్యాక్టీరియాను 99.9 శాతం వరకు తొలగించడంలో సహాయపడటంతో పాటు ముడతలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. LG ThinQ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ నుంచి మెషీన్‌ను రిమోట్‌గా కంట్రోల్‌ చేయడం, ఎనర్జీ వినియోగాన్ని పర్యవేక్షించడం, అదనపు వాష్‌ ప్రోగ్రామ్‌లను యాక్సెస్‌ చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి.

12 నుంచి 20 కిలోల కెపాసిటీ

కొత్త LG FX సిరీస్‌‌లో మొత్తం 10 మోడళ్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. వీటి సామర్థ్యం 12 కిలోల నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. ఓనిక్స్ బ్లాక్, ఎసెన్స్ బ్లాక్, ఎసెన్స్ సిల్వర్, ఎసెన్స్ గ్రాఫైట్, గ్రౌండ్ గ్రీన్ వంటి రంగుల్లో లభిస్తాయి. ఈ వాషింగ్‌ మెషీన్ల ధరలు రూ.72,990 నుంచి ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లు, ఎల్జీ బ్రాండ్‌ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఫైనాన్స్‌ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌, లాంచ్‌ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

వీడియో చూడండి

Loading...
Unable to load recommendations.
Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.