
EMI: అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లించగల సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి, నెలవారీ చెల్లింపులు ఎలా అంచనా వేయాలి, రుణ కాలపరిమితులు ఎలా పోల్చుకోవాలి, పొదుపుపై ఒత్తిడి లేకుండా ఖర్చులను ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోండి.
ఇంటి రిపేర్లు, వివాహం లేదా చదువులకు సంబంధించిన ఫీజులు వంటి అధిక విలువ గల వాటికి ఎంతో జాగ్రత్తతో ఆర్థిక ప్రణాళిక అవసరం. మీరు వ్యక్తిగత రుణం ద్వారా దీనికి డబ్బు సమకూర్చుకోవాలని భావిస్తే, మీకు ఎంత రుణం కావాలి అనేదే కాకుండా, ప్రతి నెలా మీరు సౌకర్యవంతంగా ఎంత తిరిగి చెల్లించగలరు అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న.
మీ EMI చెల్లింపు సామర్థ్యాన్ని లెక్కించడం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో మీకు సాయపడుతుంది. మీ ఆదాయం, సాధారణ ఖర్చులు, ఇప్పటికే ఉన్న EMIలు, పొదుపు మొత్తాన్ని సమీక్షించడం ద్వారా ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ, మీ బడ్జెట్‌కు సరిపోయే రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితిని మీరు ఎంచుకోవచ్చు.
ఉదాహరణలతో నాలుగు సులభమైన దశలలో EMI చెల్లించగల సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి, మీరు దరఖాస్తు చేసే ముందు తిరిగి చెల్లింపు ఎంపికలను పోల్చడానికి వ్యక్తిగత రుణ EMI క్యాలిక్యులేటర్ ఎలా సాయపడుతుందో ఇది వివరిస్తుంది.
EMI చెల్లింపు సామర్థ్యం అంటే మీ ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ ప్రతి నెలా రుణాన్ని తిరిగి చెల్లించగల మీ సామర్థ్యం. రుణం తీసుకునే ముందు మీ చెల్లింపు సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం, మీకు తగిన రుణ మొత్తాన్ని, తిరిగి చెల్లించే కాల వ్యవధిని ఎంచుకోవడంలో సాయపడుతుంది.
నాలుగు దశల్లో మీరు మీ EMI చెల్లింపు సామర్ధ్యాన్ని అంచనా వేయవచ్చు.
1. నెలవారీ ఖర్చు చేయగల మీ ఆదాయన్ని లెక్కించండి
నెలవారీగా మీ చేతికి వచ్చే జీతం లేదా సాధారణ ఆదాయంతో ప్రారంభించండి. అవసరమైన ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణ EMIలు, బీమా ప్రీమియంలు, ఇతర పునరావృతమయ్యే ఖర్చులు తీసివేయండి.
ఉదాహరణకు ఇది మీ నెలవారీ బడ్జెట్ అనుకోండి:
| ఆర్థిక వివరాలు | మొత్తం |
| నెలవారీ చేతికి వచ్చే ఆదాయం | రూ. 80,000 |
| అవసరమైన ఖర్చులు | రూ. 30,000 |
| ప్రస్తుత EMIలు | రూ. 15,000 |
| పొదుపు, ఇతర బాధ్యతలు | రూ. 10,000 |
| మిగిలిన మొత్తం | రూ. 25,000 |
మిగిలిన రూ. 25,000 కొత్త EMI కోసం ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉండవు. మీరు ఎంత మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో నిర్ణయించుకునే ముందు, అనుకోని ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పక్కన ఉంచుకోండి.
2. నెలవారీ EMIని అంచనా వేయండి
మీ EMI అనేది రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రుణ మొత్తం లేదా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మీ EMI పెరుగుతుంది, అదే కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీ వాయిదా తగ్గుతుంది.
ఉదాహరణకు, సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో రూ. 3 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే, తిరిగి చెల్లింపు వివరాలు సుమారుగా దిగువ పేర్కొన్న విధంగా ఉంటాయి:
| తిరిగి చెల్లింపు వ్యవధి | నెలవారీ EMI | మొత్తం వడ్డీ |
| 24 నెలలు | రూ. 14,404 | రూ. 45,693 |
| 36 నెలలు | రూ. 10,253 | రూ. 69,118 |
24 నెలల కాలపరిమితితో పోలిస్తే 36 నెలల కాలపరిమితిని ఎంచుకోవడం వల్ల నెలవారీ EMI సుమారు రూ. 4,151 తగ్గుతుంది. అయితే, దీనివల్ల చెల్లించాల్సిన మొత్తం వడ్డీ సుమారు రూ. 23,426 పెరుగుతుంది.
ఉపయోగకరమైన సలహా: EMI ఎంచుకునే ముందు వివిధ కాలపరిమితులు పోల్చి చూడండి. తక్కువ నెలవారీ వాయిదా మీ దగ్గర నగదు అందుబాటు ఉండేలా చూడవచ్చు, కానీ మొత్తం వ్యవధిలో చెల్లించాల్సిన పూర్తి వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకోండి.
మీరు దరఖాస్తు చేసే ముందు మీ నెలవారీ వాయిదా అంచనా వేయడానికి పర్సనల్ లోన్ EMI క్యాలిక్యూలేటర్ సాయపడుతుంది. అంచనా వేసిన EMI, మొత్తం వడ్డీ, తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని చూడటానికి రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాల వ్యవధి నమోదు చేయండి.
వివిధ రుణ ఎంపికలు పోల్చడానికి మీరు ఈ అంకెలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీ నెలవారీ బడ్జెట్‌కు సరిపోయే తిరిగి చెల్లింపు ప్రణాళికను గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది.
మీ ఖర్చు చేయగల ఆదాయం మొత్తాన్ని రుణ చెల్లింపులకే కేటాయించవద్దు. వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, బీమా ప్రీమియంలు, ఇతర అనుకోని ఖర్చుల కోసం తగినంత డబ్బు అందుబాటులో ఉంచుకోండి.
ఆచరణాత్మకమైన చెల్లింపు సామర్థ్య అంచనా, EMI, తిరిగి చెల్లించిన తర్వాత అందుబాటులో ఉండే పొదుపు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడిని నివారించడంలో మీకు సాయపడుతుంది.
హామీ అవసరం లేకుండా ప్రణాళికాబద్ధమైన లేదా అనుకోని ఖర్చుల కోసం కావాల్సిన డబ్బును పర్సనల్ లోన్ అందించగలదు. బజాజ్ ఫైనాన్స్ రూ. 40,000 నుంచి రూ.55 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగి చెల్లించే కాల వ్యవధితో అందిస్తుంది.
మీరు ఈ దిగువ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాన్ని పరిగణించవచ్చు:
రుణం తీసుకునే ముందు రుణ వ్యయాన్ని మీ దగ్గర అందుబాటులో ఉన్న పొదుపు, ఇతర అనువైన నిధుల ఎంపికలతో పోల్చి చూసుకోండి. మీకు అవసరమైన, సహేతుకంగా తిరిగి చెల్లించగల మొత్తాన్ని మాత్రమే రుణంగా తీసుకోండి.
మీ పొదుపు మొత్తం నుంచి ఒకేసారి చెల్లించే బదులుగా, క్రమబద్ధమైన నెలవారీ చెల్లింపుల ద్వారా ఒక ముఖ్యమైన ఖర్చు నిర్వహణలో పర్సనల్ లోన్ మీకు సహాయపడుతుంది.
వర్తించే అర్హత, నిబంధనలకు లోబడి బజాజ్ ఫైనాన్స్ పరన్సల్ లోన్ అనేక ఫీచర్లు అందిస్తుంది:
వర్తించే ఆఫర్, నిబంధనలను బట్టి వడ్డీ రేట్లు సంవత్సరానికి 10% నుంచి 30.5% వరకు ఉంటాయి.
పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ అర్హత సరిచూసుకోండి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి, మీకు అనుకూలమైన EMIని లెక్కించండి. ఇది మీ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన ధ్రువీకరణను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు ఇవి:
| జాతీయత | భారతీయులు |
| వయస్సు | 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు |
| కస్టమర్ ప్రొఫైల్ | స్వయం ఉపాధి లేదా వేతనం పొందేవారు |
| యజమాని (జీతం పొందే దరఖాస్తుదారుల కోసం) | ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సీ |
| సిబిస్ స్కోర్ | 650 లేదా అంత కంటే ఎక్కువ |
పర్సనల్ లోన్ అవసరమయ్యే పత్రాలు సిద్ధం చేసుకోండి
మీ కస్టమర్ ప్రొఫైల్, ధ్రువీకరణ అవసరాలకు తగినట్టుగా దిగువ పత్రాలు అందుబాటులో ఉంచుకోండి.
గుర్తుంచుకోండి: పైన పేర్కొన్న అన్ని పత్రాలు మీరు సమర్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అడిగే పత్రాలు మీ ప్రొఫైల్, ధ్రువీకరణ అవసరాలపై ఆధారపడి ఉంటాయి.
మీ పత్రాలు సిద్ధమయ్యాక మీ నెలవారీ వాయిదా అంచనా వేయడానికి పర్సనల్ లోన్ EMI (ఈఎంఐ) క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు, EMI (ఈఎంఐ)ని మీ ఆదాయం, ప్రస్తుత బాధ్యతలు, సాధారణ ఖర్చులతో పోల్చి చూసుకోండి.
ఆమోదం అనేది అర్హత, పత్రాల ధ్రువీకరణ, వర్తించే నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది.
అధిక విలువ చేసే కొనుగోళ్లు చేపట్టడానికి ముందు EMI చెల్లింపు సామర్థ్యాన్ని లెక్కించుకున్నట్టు అయితే మీ ప్రస్తుత అవసరాలను భవిష్యత్ ఆర్థిక బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడంలో మీకు సాయపడుతుంది. ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు మీ ఖర్చు చేయగల ఆదాయాన్ని సమీక్షించుకోండి, తిరిగి చెల్లించే కాలపరిమితులు పోల్చుకోండి, ఆర్థిక వెసులుబాటు కలిగి ఉండండి.
మీ తిరిగి చెల్లింపులు అంచనా వేయడానికి బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. మీకు అందుబాటులో ఉన్న రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితిని సమీక్షించుకోవడానికి, మీరు మీ అర్హతను తనిఖీ చేసుకొని బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*నియమ నిబంధనలు వర్తిస్తాయి. 24 గంటలలోపు పంపిణీ అనేది ఆమోదం, పత్రాల ధ్రువీకరణ, వర్తించే నిబంధనలకు లోబడి ఉంటుంది.