
Nagarjuna Wild Dog: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో జరుగుతోంది. ఇందుకోసం గత వారం నాగ్‌తో పాటు ప్రధాన పాత్రాధారులు అక్కడికి వెళ్లారు. కాగా ఈ షూటింగ్‌లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ భాగమయ్యారు. అక్కడ యాక్షన్ సన్నవేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగనున్నాయి.
ఇక మనాలి షూటింగ్‌లో పాల్గొన్న విషయాన్ని శామ్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. మనాలిలోని రోతంగ్ పాస్‌లో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో దేవుడి దయ వలన షూటింగ్ జరుగుతోంది. ఇవాళ ఇక్కడ మంచు పడటం ప్రారంభం అయ్యింది అని కామెంట్ పెట్టారు. కాగా దాదాపు 13వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుగుతుండగా.. 21 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జున లేకపోవడంతో ఆదివారం నాడు బిగ్‌బాస్ 4 ఎపిసోడ్‌కి సమంత వ్యాఖ్యతగా వ్యవహరించారు.
Read More:
జూనియర్ చిరు కోసం బెంగళూరు వెళ్లిన నజ్రియా దంపతులు
సోనూ సాయాన్ని ప్రశ్నించిన నెటిజన్.. సాక్ష్యం చూపించిన నటుడు