జూనియర్ చిరు కోసం బెంగళూరు వెళ్లిన నజ్రియా దంపతులు

కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్‌ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

  • Manju Sandulo
  • Publish Date - 12:37 pm, Mon, 26 October 20

Meghana raj Baby: కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్‌ ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెను చూసేందుకు మాలీవుడ్ నటీనటులు నజ్రియా నజీమ్‌, ఫాహద్‌ ఫాజిల్‌ బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మేఘనా రాజ్ ఉండగా.. ఆమెను, బిడ్డను చూసి వచ్చారు. ఆ తరువాత బృందావన్ ఫామ్‌ హౌజ్‌లో ఉన్న చిరంజీవి సర్జా సమాధి వద్ద నివాళులు అర్పించారు.

కాగా కర్ణాటకలో జన్మించిన మేఘనా రాజ్‌.. మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో అక్కడి నటీమణులైన నజ్రియా, అనన్యలతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక మేఘనా, బాబుకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన ఆ ఇద్దరు నటీమణులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. చిరు మళ్లీ పుట్టాడంటూ వారు కామెంట్లు పెట్టారు.

Read More:

సోనూ సాయాన్ని ప్రశ్నించిన నెటిజన్.. సాక్ష్యం చూపించిన నటుడు

పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత