Suryakantam: దేశం గర్వించదగ్గ స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘గయ్యాళి అత్త’ అంటే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. తెరపై ఆమె చూపించే ప్రతాపం చూసి నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటారని చాలామంది భయపడేవారు. కానీ , సూర్యకాంతం వ్యక్తిత్వం వెన్నలాంటిదని, చాలా మంది చెప్తూ ఉంటారు .

Suryakantam: దేశం గర్వించదగ్గ స్టార్ హీరో కూడా సూర్యకాంతం నటనకు ఫిదా అయ్యాడు..
Suryakantham

Updated on: Apr 30, 2026 | 10:26 AM

తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం వంటి మహానటులు మళ్లీ రారని ప్రముఖ రచయిత, దర్శకుడు కనకాల జయకుమార్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూర్యకాంతం గయ్యాళి గంప పాత్రలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఆమె నటనలో ఒక ప్రత్యేకత, సహజత్వం ఉండేవని ఆయన తెలిపారు. ఆమె నటనలా అనిపించదని, అది తెరపై ఒక నిజ జీవిత పాత్రను చూసిన అనుభూతిని ఇస్తుందని వివరించారు. ఒక సందర్భంలో కమల్ హాసన్ సైతం సూర్యకాంతం నటనను ప్రశంసించారు. సింగీతం శ్రీనివాసరావు సెట్‌లో రవిప్రకాష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో సహజ నటుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు, కమల్ హాసన్ ఛాయాదేవిని సహజ నటిగా పేర్కొంటూనే, సూర్యకాంతం ఇంకా సహజంగా నటిస్తారని, ఆమెలాంటి ఆర్టిస్టును తమిళంలో కూడా చూడలేదని చెప్పడం సూర్యకాంతం నటనా వైభవానికి నిదర్శనం అని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

సూర్యకాంతం అసలు పేరు సన్ ఫ్లవర్ అంత మంచిదని, కానీ ఆమె పాత్రల ప్రభావం వల్ల తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడానికి వెనకాడుతున్నారని జయకుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.. సెట్స్‌లో సూర్యకాంతం ఉంటే వాతావరణం ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. ఆమె కాలం మారింది చిత్రంలో పని చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, సూర్యకాంతం అందరితో సరదాగా మాట్లాడుతూ, పలకరించకుండా వెళ్లే వారిని సైతం ఆపి మాట్లాడించేవారని చెప్పారు. అంతేకాకుండా, ఆమె ఇంటి నుంచి పెద్ద క్యారేజీలు తీసుకొచ్చి సెట్స్‌లో అందరికీ వడ్డించి, బక్కగా ఉన్నావు, తిను అని బలవంతంగా తినిపించేవారట. సూర్యకాంతం, సావిత్రి, ఛాయాదేవి వంటి స్నేహితురాళ్లు సెట్స్‌లో ఉంటే, అక్కడ కోలాహలం నెలకొనేది. వారందరూ తెచ్చిన పలహారాలతో సెట్ సభ్యులు బాగా తినేవారని జయకుమార్ వివరించారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

సూర్యకాంతం ప్రధాన పాత్ర పోషించిన గుండమ్మ కథ చిత్రం గురించి కూడా ఈ సంభాషణలో చర్చించారు. రామారావు, నాగేశ్వరరావు వంటి అగ్ర కథానాయకులు నటించినా, ఆ చిత్రానికి గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద టైటిల్ పెట్టడం ఒక సాహసమనే చెప్పాలి.  రామారావు, నాగేశ్వరరావు వంటి వారు మాత్రం తమ పేరు ముందు ఉండాలని పట్టుబట్టలేదని, ఇది వారి గొప్ప మనసుకు, కళ పట్ల వారికున్న నిబద్ధతకు నిదర్శనమని కనకాల జయకుమార్ అన్నారు. నిజానికి గుండమ్మ అనే పేరు ఆంధ్ర ప్రాంతంలో అప్పటివరకు పెద్దగా వాడుకలో లేదని, కానీ నాగిరెడ్డి చక్రపాణి గారు కన్నడ చిత్రం నుంచి ఈ కథను స్వీకరించి, గుండమ్మ కథ అనే పేరునే పెట్టాలని నిర్ణయించారని జయకుమార్ వివరించారు. మాయాబజార్ లో ఆయన చెప్పినట్లు, మనుషులు పేర్లు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు అనే ఆలోచన చక్రపాణి దూరదృష్టికి నిదర్శనం. ఆ తర్వాత గుండమ్మ అనే పేరు తెలుగునాట సుపరిచితమైంది. కే.వీ. రెడ్డి గారు ఈ కథలో విషయం లేదని తిరస్కరించినప్పటికీ, కమలాకర కామేశ్వరరావు గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావు, రామారావు, నాగేశ్వరరావు, సూర్యకాంతం, ఎల్. విజయలక్ష్మి, హరనాథ్, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు నటించారు. గుండమ్మ కథ చిత్రానికి సంప్రదాయ క్లైమాక్స్ ఉండదని, జమున అహంకారాన్ని అణచి, అందరినీ కలపడమే ఆ చిత్రం ముగింపు అని కనకాల జయకుమార్ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us