Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 లిస్ట్‌లో కొత్త పేర్లు.. ఈ క్రేజీ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనుందట..!

|

Aug 27, 2024 | 4:01 PM

బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ సొంతం చేసుకోవడంతో.. ఇప్పుడు సీజన్ 8పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్తున్నారా .? అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేరులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 లిస్ట్‌లో కొత్త పేర్లు.. ఈ క్రేజీ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇవ్వనుందట..!
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ సొంతం చేసుకోవడంతో.. ఇప్పుడు సీజన్ 8పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళ్తున్నారా .? అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేరులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్  మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్‌కు ఎంత టీఆర్పీ  వచ్చిందో.. సీజన్ 7కు కూడా అంతే టీఆర్పీ వచ్చింది.

ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లడం. ఆతర్వాత హౌస్‌లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్ ఇలా చాలా ఉన్నాయి. చివరిగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక ఖయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిలిక్కల్, డ్యాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిణి సుందరరాజన్, రీతూ చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందని తెలుస్తోంది. ఆమె పేరు విస్మయ. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మైల్స్ ఆఫ్ లవ్, దిల్ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో.. అనే సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న విస్మయకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉంచిందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చేసిందట. మరి ఈ అమ్మడు నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.