మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయబోతున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 500కోట్ల వరకు కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు.
దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం చూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ సినిమా తర్వాత వార్ 2లో నటిస్తున్నాడు తారక్. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు.
కేజీఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆతర్వాత సాలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సలార్ సినిమాను ప్రశాంత్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నడు . ఇక ఈ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ సమంత కలిసి మూడు సినిమాలు చేశారు. అలాగే రష్మిక హీరోయిన్ గా సెలక్ట్ అయితే.. ఎన్టీఆర్ తో ఆమెకు ఇది తొలి సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.