
ఓటీటీ పుణ్యమా అని రకరకాల సినిమాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. మరో వైపు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నాయి. ఓటీటీల్లో మెప్పిస్తున్న సినిమాల్లో హారర్, రొమాంటిక్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బోల్డ్ సినిమాలు ఓటీటీలో లెక్కకు మించి ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే తెలుగులోకి డబ్ అయ్యి కూడా మెప్పిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇక ఓటీటీలో ఊపేస్తున్న సినిమాల్లో ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓటీటీని ఊపేస్తున్న సినిమాల్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో కేవలం బోల్డ్ సన్నివేశాలే కాదు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లింగ్ సీన్స్ కూడా బోలెడన్ని ఉన్నాయి. మానవ సంబంధాలు, అక్రమ సంబంధాలు వీటిపై ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో కట్టుకున్న భర్త మంచాన పడటంతో భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఆతర్వాత స్టోరీ ఊహించని ట్విస్ట్ లోకి మారుతుంది. ఇంతకూ ఈ సినిమా పేరేంటి..? ఓటీటీలో ఎక్కడ చూడోచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.!
ఈ సినిమా కథ ఓ గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో డోలోరెస్ అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తుంటుంది. అతను ఓ ప్రమాదంలో గాయపడి పక్షవాతం బారిన పడతాడు. అయితే డోలోరెస్ చాలా అందంగా ఉంటుంది. ఆమె జీవితం ఓ చిన్న గ్రామంలో తీరని కోరికలతో ఉంటుంది. భర్త మంచాన పడటంతో ఆమె కోరికలు నెరవేరకుండా ఉంటాయి. అయితే అదే సమయంలో ఆమె జైరాన్ అనే వ్యక్తిని కలుస్తుంది. జైరాన్ ఓ బాటసారి. అతను ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండటానికి వస్తాడు. అతను మంచి యవ్వనంలో ఉండటంతో డోలోరెస్ అతనిపై మనసు పడుతుంది. తన కోరికలను అతనితో తీర్చుకుంటుంది. అయితే వీరి వ్యవహారం హద్దులు మీరిపోతుంది. కానీ ఆమె భర్త మాత్రం డోలోరెస్ పై ఎంతో ప్రేమతో విధేయతతో ఉంటాడు. కానీ ఆమె మరో వ్యక్తితో యవ్వారం నడుపుతుంది. క్రమంగా ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. దాంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. చివరకు ఏమైంది.? ఆమె ఎవరిని ఎంచుకుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు లిగావ్. 85 నిమిషాల నిడివి గల ఈ సినిమా వివామాక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి హెడ్సెట్ పెట్టుకొని ఒంటరిగా చూడాల్సిన సినిమా ఇది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.